Ads
తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఈ నోటిఫికేషన్లని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో నోటిఫికేషన్లకి దరఖాస్తు చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
Step – 1
అప్లై చేసే వాళ్ళు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
Step – 2
హోమ్ పేజీలో కుడి వైపు ఉన్న వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration) మీద క్లిక్ చేయాలి.
Step – 3
ఆధార్ డీటెయిల్స్ (Aadhar Details) అనే సెక్షన్ లో మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి.
Step – 4
పర్సనల్ డీటెయిల్స్ లో (Personal Details) మన వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
Step – 5
అడ్రస్ డీటెయిల్స్ లో (Address Details) మనం ఉండే చోటు కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి.
Step – 6
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో (Educational Qualifications) మన చదువుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి.
Step – 7
అడిషనల్ క్వాలిఫికేషన్స్ లో (Additional Qualifications) అదనపు వివరాలు ఎంటర్ చేయాలి.
Step – 8
ఆ తర్వాత ఫోటో అప్ లోడ్ చేయాలి.
Step – 9
నోటిఫికేషన్ అలర్ట్ (Notification Alert) ఆన్ పెడితే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి.
Step – 10
ఆ తర్వాత ప్రివ్యూ (Preview) క్లిక్ చేయాలి. అందులో ఒకసారి మనం ఎంటర్ చేసిన వివరాలు అన్నీ చూసుకోవాలి.
Step – 11
అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అప్పుడు TSPSC ID జనరేట్ అవుతుంది.
End of Article