కార్ “FUEL TANK” మీటర్ లో…ఆ “SYMBOL” కి అర్ధం ఏంటో తెలుసా?

కార్ “FUEL TANK” మీటర్ లో…ఆ “SYMBOL” కి అర్ధం ఏంటో తెలుసా?

by Mohana Priya

Ads

మనం కారుని తరచుగా చూస్తూ ఉంటాం, వాడతాం కూడా. కానీ కార్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం. అందులో ఒకటి పెట్రోల్ పోసే హోల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం. చాలామందికి తమ కార్ కి పెట్రోల్ ఎటువైపు పోస్తారో సరిగ్గా తెలీదు. అందుకే ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు కారు దిగి పెట్రోల్ హోల్ ఎక్కడ ఉందో చూస్తాం.

Video Advertisement

కొన్ని కార్లకి ఆరో (<)  సింబల్ ఉంటుంది. అది ఫ్యూయల్ క్యాప్ ఎటువైపు ఉంటుందో చూపిస్తుంది. కొన్నిటికి ఉండదు. కానీ అలా దిగి చూడాల్సిన అవసరం లేకుండానే పెట్రోల్ ఎటు వైపు పోయించుకోవాలి అనే విషయం తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే కొన్ని కార్లకి గేజ్ దగ్గర ఒక చిన్న పెట్రోల్ పంప్ బొమ్మ ఉంటుంది. దాని పక్కన ఒక ఆరో (<) ఉంటుంది. అది ఎటువైపు చూపిస్తుంటే అటువైపు ఫ్యూయల్ క్యాప్ ఉంటుంది అని అర్థం.

ఒకొక్కసారి ఫ్యూయల్ క్యాప్ విరిగిపోవడం లేదా ఇంకేదైనా కారణం వల్ల పెట్రోల్ హోల్ మీద మూత ఏం లేకుండానే వదిలేస్తూ ఉంటాం. దాని వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందట. ఒకవేళ కార్ ఫుల్ ట్యాంక్ ఉంటే పెట్రోల్ బయటికి చిందుతుంది. అంటే పెట్రోల్ లీక్ అవుతుంది. దానివల్ల కార్ నుండి వచ్చే ఎమిషన్ మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఒకవేళ పెట్రోల్ క్యాప్ లేకపోతే వీలైనంత త్వరగా వేరే పెట్రోల్ క్యాప్ మార్చడం మంచిది.ఈసారి పైన చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీ కార్ కి పెట్రోల్ క్యాప్ ఎక్కడ ఉందో తెలియకపోతే గేజ్ మీద చూడండి.


End of Article

You may also like