“ఇయర్ ఫోన్స్” తో చాలా మంది ఆ సమస్య ఎదుర్కొనే ఉంటారు…రీఫిల్ తో చెక్ పెట్టండిలా!

“ఇయర్ ఫోన్స్” తో చాలా మంది ఆ సమస్య ఎదుర్కొనే ఉంటారు…రీఫిల్ తో చెక్ పెట్టండిలా!

by Mohana Priya

Ads

మన రోజువారి జీవితంలో సెల్ ఫోన్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్న చిన్న విషయాల నుండి ఎంతో ముఖ్యమైన వివరాలు దాక అన్ని సెల్ ఫోన్ లోనే ఉంటాయి. కానీ తరచుగా మనం సెల్ ఫోన్ లో ఏదైనా వినాలంటే మన చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కాకుండా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తాం. అలా మనకి తెలియకుండానే ఇయర్ ఫోన్స్ కూడా మన జీవితంలో లో ఒక భాగం అయిపోయాయి. మనం బయటికి వెళ్లాలంటే తీసుకెళ్లే డబ్బులు, ఏటీఎం కార్డు, పర్సు లాంటి వస్తువుల్లో ఇయర్ ఫోన్స్ కూడా చేరాయి.

Video Advertisement

దీన్ని మనం ఎంత వాడుతున్నాము అంటే ఒకవేళ మనం ఇయర్ ఫోన్స్ మర్చిపోయి బయటికి వెళ్తే మళ్లీ గుర్తొచ్చి వెనక్కి వచ్చి తీసుకొని వెళ్లే అంత అలవాటు పడిపోయాం. కానీ అసలు సమస్య ఏంటి అంటే ఇయర్ ఫోన్స్ ని జాగ్రత్తగా పెట్టుకోవడం. మనం హడావిడిలో వాడిన తర్వాత ఎక్కడో పడేస్తాం. అలా చేయడం వల్ల ఇయర్ ఫోన్స్ తొందరగా పాడైపోవడం లేదా విరిగిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి జాగ్రత్తగా పెట్టినా కూడా ఎక్కువగా వాడటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు వాటిని వాడ బుద్ధి కాదు అలా అని రిపేర్  చిన్నదే కాబట్టి కొత్తవి కూడా కొనలేము.

ఇలా ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యల్లో ఒక సమస్య పిన్ దగ్గర ఉన్న వైర్ విరిగిపోవడం. అలా విరిగిపోయిన అప్పుడు మనం సాధారణంగా చేసే పని ఆ వైర్ ని విరిగిన చోట ప్లాస్టర్ తో చుట్టడం. కానీ ప్లాస్టర్ కూడా ఎక్కువకాలం ఉండదు. కొద్దిరోజులకే అది కూడా ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోయిన ప్రతిసారి మళ్లీ ప్లాస్టర్ వేసే బదులు ఇప్పుడు చెప్పే టెక్నిక్ పాటిస్తే ఇయర్ ఫోన్స్ ఎక్కువ కాలం విరిగి పోకుండా ఉంటాయి.

ఇప్పుడు చెప్పే టెక్నిక్ పాటిస్తే ఇయర్ ఫోన్స్ ఎక్కువ కాలం విరిగి పోకుండా ఉంటాయి.

  • కొంచెం మందంగా ఉన్న వాడేసిన బాల్ పెన్ రీఫిల్ తీసుకోండి.

  • ఇప్పుడు పెన్సిల్ షార్పనర్ తీసుకోండి. రీఫిల్‌ను షార్పనర్ లో పెట్టి నెమ్మదిగా తిప్పండి.

  • అప్పుడు ఇలాంటి పొట్టు వస్తుంది. దీన్ని హెలిక్స్ అంటారు.

  • ఇప్పుడు ఇయర్ ఫోన్స్ మీద ఎక్కడైతే వైర్ కనిపిస్తుందో అక్కడ ఆ హెలిక్స్ ని చుట్టండి.

  • విరిగిపోయిన వైర్ కనిపించకుండా, ఇంకా ఎంత వాడినా ఇయర్ ఫోన్స్ కి ఏం కాకుండా, ఎక్కువ రోజులు రావడానికి ఈ హెలిక్స్ ఉపయోగపడుతుంది.


End of Article

You may also like