పాల ప్యాకెట్ లు శానిటైజ్ చేసేటప్పుడు ఆ తప్పు చేయకండి..! తప్పక తెలుసుకోండి.!

పాల ప్యాకెట్ లు శానిటైజ్ చేసేటప్పుడు ఆ తప్పు చేయకండి..! తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

ఇప్పుడు ఉన్న సమయంలో తినడం, పనులు చేసుకోవడం తో పాటు శానిటైజింగ్ కూడా రోజు వారి జీవితంలో ఒక భాగమైపోయింది. బయట నుండి వచ్చిన తర్వాత చేతులను శానిటైజర్ తో శుభ్రపరుచుకుంటున్నాం. కూరగాయలను పండ్లను వేడి నీళ్లలో వేసి కడగడం చేస్తున్నాం.

Video Advertisement

వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన పదార్థం శుభ్రపరుచుకోవాలి అన్న విషయం మర్చిపోయాం. అవే పాల ప్యాకెట్లు. పాలు ప్యాకెట్ లో పోసి ఆల్రెడీ సేఫ్ గానే ఉన్నాయి కదా. మళ్లీ శుభ్రం చేయాల్సిన అవసరం ఏంటి? అని మీ అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు.

కానీ విషయం ఏంటంటే, పాల ప్యాకెట్ల కవర్లు ప్లాస్టిక్ తో తయారవుతాయి. కరోనా వైరస్ ప్లాస్టిక్ పై దాదాపు మూడు రోజుల పాటు బతికే ఉంటుందట. అందుకే ప్యాక్ చేసినా కూడా ఆ కవర్ ప్లాస్టిక్ కాబట్టి శానిటైజింగ్ ఖచ్చితంగా చేయాలట. ప్యాకెట్ పాలను ఎలా శానిటైజ్ చేయాలో చెబుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్ ద్వారా ఈ విధంగా వివరించింది.

#1 పాల వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకునేటప్పుడు సామాజిక దూరం పాటించండి. పాల అతను మాస్క్ వేసుకున్నాడా లేదా అనేది చూడండి. ఒకవేళ మాస్క్ వేసుకోకపోతే వేసుకోమని చెప్పండి.

#2 పాల ప్యాకెట్ ని నీళ్లతో శుభ్రంగా కడగండి.

#3 పాల పాకెట్ లో ఉన్న పాలను గిన్నెలో పోసే ముందు చేతులని శుభ్రంగా కడుక్కోండి.

#4 పాల ప్యాకెట్ ను కడిగిన వెంటనే కట్ చేసి పాలను గిన్నెలో పోసేయకండి. కొంచెం సేపు ఆ పాల ప్యాకెట్ ను ఆరనివ్వండి. లేకపోతే కడిగినప్పుడు ఆ పాల ప్యాకెట్ కు ఉన్న నీళ్ళు కూడా గిన్నెలో పడే అవకాశాలు ఉన్నాయి.

#5 అలా ఆరిన పాల ప్యాకెట్ ను కట్ చేసి పాలను ఒక గిన్నెలో పోసి వేడి చేయండి.

ఒకవేళ మీరు పాలు ప్యాకెట్ రూపంలో కాకుండా విడిగా తీసుకుంటున్నట్లయితే మీ గిన్నెను శుభ్రంగా కడిగి తీసుకు వెళ్ళండి. పాలు పోయించుకునేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించడం మాత్రం మర్చిపోకండి.

ఒకవేళ పాల ప్యాకెట్ ఇంటికి సప్లై చేసేటట్లయితే మీరే వెళ్లి డైరెక్ట్ గా పాల ప్యాకెట్లు తీసుకోకుండా ఇంటి ముందు గేటు కి ఒక బుట్ట లేదా కవర్ కట్టి పాల ప్యాకెట్లను అందులో వెయ్యమని చెప్పండి. తర్వాత పైన చెప్పినట్లుగా పాల ప్యాకెట్లను శుభ్రపరుచుకోండి. పాల ప్యాకెట్లే కాకుండా ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసిన ఏ వస్తువైనా లేదా ఏ తినే పదార్థమైనా సరే కవర్ ని మాత్రం ఖచ్చితంగా శానిటైజ్ చేయండి.


You may also like