వాట్సాప్ లో “నెంబర్ సేవ్” చేసుకోకుండా మెసేజ్ చేయాలా.? అయితే ఇలా చేయండి.! చాలా ఈజీ

వాట్సాప్ లో “నెంబర్ సేవ్” చేసుకోకుండా మెసేజ్ చేయాలా.? అయితే ఇలా చేయండి.! చాలా ఈజీ

by Megha Varna

Ads

వాట్సప్ ద్వారా మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా వాళ్ల మొబైల్ నంబర్‌ను మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ప్రస్తుతం  ఆ అవసరం కూడా లేకుండానే మెసేజ్ చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.అత్యవసరంగా కొత్త నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాల్సి వస్తే నంబర్ సేవ్ చేసుకొనే చేయాలంటే ఒక్కోసారి లేట్ అవుతుంది. ఇదంతా లేకుండా.. నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ ద్వారా మెసేజ్‌ చేయొచ్చు. అవునండీ.. మరో విషయం గుర్తించుకోండి.. మీరు పంపే మొబైల్ నెంబర్ కు వాట్సాప్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.అప్పుడు మాత్రమే మీరు పంపే మెసేజ్ వారి వాట్సాప్ అకౌంట్ కు వెళ్తుంది. కానీ, ఫోన్ నెంబర్ యాడ్ చేయకుండా ఎలా మెసేజ్ పంపాలో తెలుసా? అయితే ఈ ట్రిక్ మీకోసమే. ఓసారి ప్రయత్నించి చూడండి. 

Video Advertisement

ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి : 

  1. మీరు పంపే మొబైల్ నెంబర్ కు.. WhatsApp అకౌంట్ ఉండి ఉండాలి.
  2. ముందుగా మీరు మీ  ఫ్రెండ్స్ లో ఎవరి చాట్ అయిన ఓపెన్ చేసిన నేను చెప్పిన విధంగా టైప్ చేసి మెసేజ్ పంపండి.

3.wa.me/+91ఫోన్ నెంబర్ –  ఫోన్ నెంబర్ ప్లేస్ లో మీరు ఎవరికి మెసేజ్ చేయాలో వారి నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయండి…

4.మీరు send చేసిన మెసేజ్ మీద క్లిక్ చేయండి ,వెంటనే వాళ్ళ WhatsApp అక్కౌంట్ ఓపెన్ అవుతుంది.

అలాగే మీ మీ whatsapp నెంబర్ మీద మీ చాట్ ఓపెన్ చేసుకోవచ్చు ….ఎలా అంటే wa.me/+91మీ నెంబర్ టైప్ చేసి మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సెండ్ చేయండి …మీ ఫ్రెండ్ కి పంపిన msg మీద క్లిక్ చేయండి ,వెంటనే మీ మీ నెంబర్ తో వ్హత్సప్ప్ చాట్ ఓపెన్ అవుతుంది…ట్రై చేయండి ఇప్పుడే …అందరికీ షేర్ చేయండి 

 


End of Article

You may also like