Ads
బాలీవుడ్ హీరో అయినా కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో హృతిక్ రోషన్. అయన డాన్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ఫైటర్
- నటీనటులు : హృతిక్ రోషన్, అనిల్ కపూర్, దీపికా పదుకొనే.
- నిర్మాత : మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే, కెవిన్ వాజ్, అజిత్ అంధారే
- దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
- సంగీతం : విశాల్, శేఖర్
- విడుదల తేదీ : జనవరి 25, 2024
స్టోరీ :
షంషేర్ పఠానియా అలియాస్ ప్యాటీ (హృతిక్ రోషన్) ఎయిర్ ఇండియాలోని ఒక ఫైటర్ పైలైట్. అయితే, దేశంలో ఉన్న బెస్ట్ ఫైటర్ పైలైట్స్ ని శ్రీనగర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఒక స్పెషల్ పోస్టింగ్ కి పిలిపిస్తారు. ప్యాటీ కూడా అక్కడికి వెళ్తాడు. తన ర్యాంక్ తో ఉన్న మిన్నీ అలియాస్ మీనల్ రాథోడ్ (దీపికా పడుకొనే) అక్కడ పరిచయం అవుతుంది. వారందరినీ కలిపి ఎయిర్ డ్రాగన్ అనే ఒక స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. వారి సీఓ రాకీ (అనిల్ కపూర్). పుల్వామా ప్రాంతంలో సి ఆర్ పి ఎఫ్ జవాన్ల మీద జైషే అనే ఒక ఉగ్రవాద సంస్థ దాడులు జరుపుతుంది.
దాని మీద ప్రతికాలం తీర్చుకోవడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లో ఉన్న బాలాకోట్ లో కొన్ని ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలని ధ్వంసం చేస్తారు. అక్కడ వందలాది మంది మిలిటెంట్లని చంపేస్తారు. ఆ తర్వాత ఒక సుఖోయ్ యుద్ధ విమానం పాకిస్తాన్ లో ధ్వంసం అవుతుంది. దాంతో ఇద్దరు పైలెట్లు పారాచూట్ల సహాయం తీసుకొని పార్క్ భూభాగంలో దిగుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వారి సైన్యాన్ని ఎలా కాపాడుకున్నారు? ఆ పైలట్లని భారత్ కి తీసుకు వచ్చారా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా యాక్షన్ సినిమాలు అంటే భాషతో సంబంధం లేకుండా ప్రతివారు ఆదరిస్తారు. అందులోనూ ముఖ్యంగా హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమా చేస్తున్నారు అంటే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూశాక పెద్దగా అంచనాలు అయితే ఏమీ లేవు కానీ, సినిమా నిరాశపరచదు అనే ఒక నమ్మకం మాత్రం వచ్చింది. అయితే సిద్ధార్థ్ ఆనంద్ గతంలో దర్శకత్వం వహించిన వార్, పఠాన్ సినిమాల ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి అని అనిపించింది.
ఆ రెండు సినిమాలకు పని చేసిన వారే ఈ సినిమాలకి పనిచేయడంతో అలా అనిపించింది కానీ, సినిమా కథ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. యాక్షన్ సీన్స్ చాలా బాగా తీశారు. దాంతో పాటు ఎమోషన్స్ కూడా ఉండేలాగా చూస్తున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ కోసం తన పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. పాటల్లో డాన్స్ చేస్తూనే, ఫైటింగ్ సీన్స్ ఫైటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఒక పైలైట్ బాడీ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో హృతిక్ రోషన్ అలాగే ప్రాక్టీస్ చేశారు అని తెలుస్తోంది.
హీరోయిన్ దీపికా పడుకొనే కూడా బాగా నటించారు. అలాగే అనిల్ కపూర్ కూడా మంచి పాత్రలో కనిపించారు. సహాయ పాత్రల్లో నటించిన కరణ్ సింగ్ గ్రోవర్, అభిషేక్ ఒబెరాయ్ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. అయితే సినిమా ఎంత బాగున్నా కూడా కథ తెలిసిపోతూ ఉంటుంది. టేకింగ్ పరంగా ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు కానీ, నెక్స్ట్ ఏమవుతుంది అనేది యాక్షన్ సినిమాలు సాధారణంగా ఎక్కువగా చూసే ప్రేక్షకుడికి అర్థం అయిపోతుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- హీరో, హీరోయిన్ల నటన
- పాటలు
- యాక్షన్ సీన్స్
- కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే కథ
- కొన్ని చోట్ల సాగదీసినట్టుగా ఉన్న స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, హృతిక్ రోషన్ కోసం, లేదా ఒక మంచి యాక్షన్ సినిమా చూద్దాం అని అనుకునే వారికి ఫైటర్ సినిమా ఒక్కసారి చూడగలిగే మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “1000 అయ్యింది.. రెండు లివర్ లు ఎక్స్ట్రా” అని ట్రోల్ చేసారు… కానీ ఈ అసలు లెక్క ఏంటో తెలుసా.?
End of Article