కరోనా భయం పక్కన పెట్టి మానవత్వం చూపించిన చైనీయులు (వీడియో)

కరోనా భయం పక్కన పెట్టి మానవత్వం చూపించిన చైనీయులు (వీడియో)

by Megha Varna

Ads

“కరోనా” ఈ పేరు చెప్పితే ప్రపంచం మొత్తం వణికిపోతోంది,కరోనా వైరస్‌ భయంతో ఇతరులకు దగ్గరిగా వెళ్లాలంటే భయపడిపోతున్నారు. కరోనా వ్యాప్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్‌లు ధరించడంతోపాటు ఒకరి దగ్గరకు మరోకరు వెళ్లకుండా దూరం పాటిస్తున్నారు.ఈ క్రమంలో చైనా ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు,కరోనా భయం పక్కన పెట్టి ఒక వ్యక్తి కి సహాయం చేసారు.

Video Advertisement

పూర్తి వివరాల్లోకి వెళితే..చైనా లో బోజౌ అనే ప్రదేశంలో ట్రైసైకిల్‌ మీద వెళ్తున్న వ్యక్తి ని కారు ఢీకొట్టింది,వ్యక్తి తో పాటు ట్రైసైకిల్‌ లో ఉన్న యాపిల్స్ అన్ని రోడ్డు మీద పడిపోయాయి,దీంతో ట్రాఫిక్‌కు చిన్నపాటి అంతరాయం కలిగింది.వెంటనే అక్కడ ఉండే జనం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కింద పడిన యాపిల్స్ అన్నింటిని ఏరి బాక్సుల్లో పెట్టారు…దాదాపు 20 మంది వచ్చి 4 నిమిషాల్లో కింద పడిపోయిన యాపిల్స్‌ను ఏరి బాక్స్‌ల్లో పెట్టారు. ఈ విషయం అంతా అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది.చైనా న్యూస్‌ ఏజెన్సీ జిన్హువా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.


End of Article

You may also like