Ads
కరోనా వైరస్ నేపథ్యంలో తుమ్ములు వచ్చిన ,దగ్గు వచ్చిన ఏ చిన్న విషయం జరిగిన కరోనా వైరస్ వచ్చిందేమో అని జనాలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా వలన లక్షలాది మంది చనిపోవడమే ప్రజలలో కలుగుతున్న భయానికి కారణం.అయితే ఉత్తరప్రదేశ్ లో ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో గబ్బిలాలు చనిపోయి కనిపించడం అక్కడి ప్రజలలో బయన్దోళనలు కలిగించాయి .ఆ వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
representative image
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఒక్కసారిగా వందలాది గబ్బిలాలు మరణించి కనిపించాయి.అసలే కరోనా వైరస్ గబ్బిలం నుండే పుట్టింది అనే ఓ వార్త ప్రచారంలో ఉంది.దీంతో స్థానికులందరు గబ్బిలాలకు కరోనా వచ్చిందేమో దానివలన వారి ప్రాంతం అంతా కూడా కరోనా విజృభింస్తుందేమో అని భయపడ్డారు.దీంతో సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు పశువైద్యులను రంగంలోకి దింపారు.దీంతో చనిపోయిన గబ్బిలాలను పరీక్షా కేంద్రానికి తరలించారు.
representative image
గబ్బిలాలను పరీక్షించగా గబ్బిలాలు కరోనా వైరస్ లాంటిది ఏమిలేదని స్పష్టం చేసారు.గత కొద్ది రోజులుగా దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉండడం వలన మరియు వాటికీ నీరు కూడా సరిగ్గా దొరకకపోవడం వలన మరణించాయి అని అధికారులు క్లారిటీ ఇచ్చారు.కాబట్టి ఈ విషయంలో స్థానికులు భయపడాల్సిన అవసరం ఏమి లేదని ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు.గతంలో కూడా తమిళనాడు లో ఎక్కువ సంఖ్యలో కాకులు మరణించినప్పుడు కూడా అందరూ కరోనా ఏమో అని భయపడ్డారు కానీ ఆహారం దొరకక చనిపోతున్నాయి అని తర్వాత తెలిసింది.అలాగే కర్నూల్ లో ఎక్కువ సంఖ్యలో కోతులు కూడా ఆహారం ,నీరు దొరకక మరణించాయి.ఈ లాక్ డౌన్ సమయంలో మూగ జీవాలకు ఆహారం అందించేవారు లేక పెద్ద సంఖ్యలో అవి మరణించడం అందరిని బాధపెడుతోంది.
End of Article