“నాన్న వచ్చాడు..!” అని సంతోషంగా చెప్పింది… కానీ చివరికి..? వెలుగులోకి వచ్చిన వింత సంఘటన..!

“నాన్న వచ్చాడు..!” అని సంతోషంగా చెప్పింది… కానీ చివరికి..? వెలుగులోకి వచ్చిన వింత సంఘటన..!

by Sainath Gopi

Ads

చాలా సంవత్సరాల క్రితం తన భర్త అదృశ్యం అవడంతో ఆ భార్య ఆరోజు నుండి అతని కోసం వెతుకుతూ ఉంది.  ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు తన భర్త కనిపించడంతో అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళింది. భర్త తిరిగి వచ్చాడని, ఇక నుండి కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని అనుకునే లోపే,

Video Advertisement

ఆమె ఊహించని పరిణామంతో ఆ భార్య షాక్ అయ్యింది. ఎందుకంటే తాను తీసుకొచ్చిన వ్యక్తి , అదృశ్యం అయిన తన భర్త కాదని తేలియడమే. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో చోటు చేసుకుంది. ఆ మహిళ ఎవరో? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. up-woman-telugu-addaఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన జానకీ దేవి భర్త కొన్నేళ్ళ క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి ఆమె తన భర్త కోసం వెతుకుతూనే ఉంది. ఇటీవల బల్లియాలోని జిల్లా హాస్పటల్ ముందు చాలా దయనీయంగా ఉన్న ఒక దివ్యాంగుడిని చూసింది. ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకెళ్లింది. అతని గడ్డం మరియు జుట్టు అచ్చం తన భర్త వలె ఉండడంతో పొరబాటు పడింది. అతన్ని చిరిగిన బట్టలలో చూసి బాధపడిపోయింది.
ఆసుపత్రి బయట అతన్ని చూసి ఇన్నేళ్ల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? ఇంతకాలం ఎక్కడున్నావు? అని జానకీ దేవి అడిగింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడలేదు. జానకీ దేవి అతన్ని ఇంటికి తీసుకొచ్చి, అతనికి షేవింగ్ చేయించిన తరువాత చూసి షాక్ అయ్యింది. ఆ తరవాత అతని పుట్టు మచ్చలు చూసి భర్త కాదో గుర్తు పట్టడం కోసం ప్రయత్నించింది. కానీ పుట్టు మచ్చలు కూడా కనిపించలేదు. దాంతో ఇంటికి తీసుకువచ్చిన వ్యక్తి తన భర్త కాదని గ్రహించింది.అంతకు ముందు “నాన్న వచ్చాడు” అని తన పిల్లలతో ఆనందంగా చెప్పింది. ఒక కొత్త కుర్తాను తీసుకురమ్మని డబ్బులిచ్చి పిల్లలను పంపింది. కానీ చివరికి అతను తన భర్త కాదని, తప్పు తెలుసుకుని అతనికి క్షమాపణలు చెప్పి, అ వ్యక్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఇదంతా చూసిన స్థానికులందరు ఆశ్చర్యపోయారు.

Also Read: “భారతి” కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం… ఆమె కోసం ఏం చేసిందో తెలుసా..?


End of Article

You may also like