ప్రపంచంలో మానవ సంబంధాలకు ఎంతో విలువ ఇస్తారు. కానీ కొంత మంది మాత్రం ఈ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల బెంగళూరు శివాజీ నగర్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళితే న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం వసీం షరీఫ్ అనే వ్యక్తికి 2018 లో పెళ్లి జరిగింది. తన మిత్రులతో కలిసి భార్యల మార్పిడికి అలవాటు పడ్డాడు.

Husband forces wife for wife swapping in Bengaluru

వైఫ్ స్వాపింగ్ పేరుతో జరిగే ఈ సంప్రదాయంలో భార్యలను మార్చుకుంటారు. అయితే ఇటీవల ఒక కారు కంపెనీ అధినేత ఇలా భార్య మార్పిడి చేసే గ్రూప్ లో చేరాడు. తన భార్యని వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమని కోరాడు. అందుకు తన ఒప్పుకోకపోవడంతో ఆమెను కొట్టాడు. పెళ్లి కాకముందు ఎన్ని అఫైర్లు ఉన్నాయో అని నిందలు వేసాడు. మాదక ద్రవ్యాలు ఎక్కించి ఫ్రెండ్ గదిలోకి వెళ్లాలని బలవంతం చేశాడు.

Husband forces wife for wife swapping in Bengaluru

అతని కళ్ళ ముందు తన ఫ్రెండ్స్ తన భార్యను బలవంతం చేస్తూ ఉంటే ఆ వీడియోని తీశాడు. ఇదంతా భరించిన భార్య తట్టుకోలేక భర్త అరాచకాలను తన అత్త గారికి తెలియజేసింది. కానీ వాళ్ళ అత్తగారు “భర్త మాట వింటే తప్పేముంది? ఇది తెలిస్తే పరువు పోతుంది” అని చెప్పింది. ఇటీవల గోవాకి వెళ్ళినప్పుడు మద్యం తాగి ఇలాగే ఫ్రెండ్ తో గడపాలని ఇబ్బంది పెట్టాడు.

Husband forces wife for wife swapping in Bengaluru

భర్త ప్రవర్తనతో విసుగు చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫ్రెండ్ భార్యపై బలవంతం చేసిన కారణంగా ఇద్దరు నిందితుల్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం.