Ads
ఇల్లందులో ఇటీవల జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది వివరాల్లోకి వెళితే స్టేషన్ కు చెందిన 22 సంవత్సరాల శృతికి, 23 సంవత్సరాల మేకల దినేష్ తో పరిచయం ఏర్పడింది. శృతి, దినేష్ వారం రోజుల క్రితం పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కొత్తగూడెంలోని రుద్రంపూర్ లో ఒక గది అద్దెకి తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు.
Video Advertisement
దినేష్ కుటుంబసభ్యులు ఈ విషయం తెలుసుకొని కొత్తగూడెం లోనే ఉంటున్న శృతి సోదరిని, దినేష్ స్నేహితులను బెదిరించి అడ్రస్ తెలుసుకున్నారు వాళ్ళిద్దర్నీ పట్టుకొని శృతిపై దాడి చేశారు. శ్రుతిని తల్లి సత్యవతి దగ్గరకు పంపించి, దినేష్ ని తమవెంట తీసుకెళ్లారు. దీంతో శ్రుతి రెండు రోజుల క్రితం ఇల్లందు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది.
పోలీసులు దినేష్ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంవల్ల దినేష్ శ్రుతిని వదిలేస్తాను అని చెప్పాడు. దాంతో ఏం చేయాలో తెలియక శృతి హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. శృతి తల్లి ఇదంతా గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
End of Article