సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. భార్య వాట్సప్‌కు ఫొటోలు.! చివరి చూపు కూడా దక్కలేదు.!

సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. భార్య వాట్సప్‌కు ఫొటోలు.! చివరి చూపు కూడా దక్కలేదు.!

by Megha Varna

Ads

కరోనా తో చనిపోతే బంధుమిత్రులను దూరం నుండి చూడడానికి కూడా అనుమతించడం లేదు . ఇలాంటి సంఘటనలు చాలా హృదయ విషాదం గా మారాయి ..లాక్ డౌన్ వలన ప్రయాణ మార్గాలన్నీ ప్రపంచమంతా నిలిచిపోయాయి ..బస్సు రైల్ విమానం అనే తేడా లేకుండా అన్నింటిని నిర్బంధించారు ..ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి సంబందించిన ఒక ఘటన మన కళ్ళు చెమర్చేలా చేస్తాయి..

Video Advertisement

Representative Image Only

సింగపూర్ లో వెల్డరుగా పనిచేసేందుకు వెళ్లిన ఎస్ .రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన వెలుగుల సూర్యారావు (35 ) రెండు రోజుల క్రితం మరణించాడు .కాగా కరోనా వైరస్ వలన అన్ని రవాణా మార్గాలను నిలిపి వేయడంలో భాగంగా విమాన మార్గాన్ని కూడా నిలిపి వేయడంతో ఆఖరి చూపు కూడా దక్కక అతడి కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుంది .వమ్మవరం గ్రామానికి చెందిన సూర్యారావు నాలుగు నెలల క్రితం సింగపూర్ వెళ్లగా అక్కడ వెల్డర్ గా పనిచేస్తున్నాడు ..ఆదివారం పనిచేస్తుండగా సూర్యారావు మృతి చెందాడని సూర్యారావు పనిచేస్తున్న కంపిని అధినేత ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని అతడి భార్య శ్రావణి చెప్పారు .

తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియలేదని, ప్రమాదమా?, మరేమైనా కారణమా? అనేది చెప్పలేదని వాపోయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చే దారి లేక అక్కడ వున్న సూర్యారావు స్నేహితులు, సిబ్బంది, తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించి ఆ వీడియో, ఫొటోలు తమకు పంపారని శ్రావణి చెప్పారు.

 

కాగా సూర్యారావు కు నాలుగు సవంత్సరాల బాబు ,మూడు సవంత్సరాల పాపా ఉన్నారు .కుటుంబ పోషణ కోసం పిల్లల భవిషత్తు కోసం సింగపూర్ వెళ్లిన తన భర్త మరణించడంతో మేము రోడ్ మీద పడ్డామని పిల్లల భవిష్యత్ అంధకారంగా మారిందని శ్రావణి బోరున ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నారు ..కనీసం భర్త కడసారి చూపు కూడా దక్కలేదని రోదిస్తుంది ..కాగా ఈ సంఘటనతో గ్రామా ప్రజలందరూ విషాదంలో మునిగిపోయారు.

Also Read >>>ఆయన చనిపోతే దూరం నుండి కూడా చూడనివ్వలేదు…క్రేన్లతో పూడ్చేస్తున్నారు! యూఎస్ లో దీన స్థితిపై మాజీ హీరోయిన్!


End of Article

You may also like