Ads
భార్య, భర్తల ప్రేమ ఎంతో మధురంగా ఉంటుంది. పార్ట్నర్ నిజంగా పక్కన ఉంటే ఎంతో ఆనందంగా ఏ బాధ లేకుండా హాయిగా ఉండొచ్చు. అయితే అప్పుడప్పుడు ఎవరి మధ్యనైనా గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటిని మళ్లీ మర్చిపోవడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కరి బంధం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది భర్తలు తమ భార్యలను ఇంప్రెస్ చేయాలని మంచి గిఫ్ట్లు వంటివి ఇస్తూ ఉంటారు.
Video Advertisement
మరి కొందరు భర్తలకి అసలు అలా మెప్పించడం తెలియదు. అయితే భార్యను మెప్పించడానికి చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చిలిపి పనులు, ప్రేమ మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూనే ఉంటాం. తాజాగా ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అసలు ఆ వీడియోలో ఏముంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.
ఇక్కడ ఈ భర్త తన భార్యని ఇంప్రెస్ చేయాలని కొత్త కొత్త ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ లాహోర్ కి చెందిన కంటెంట్ రైటర్ బిలాల్ ఖాన్ ఏం చేశారు అంటే తన భార్య దువా సిద్ధిఖీనికి గులాబీ ఇచ్చి ఎంతో షాక్ కి గురి చేశాడు. వెంటనే తన భార్య సిగ్గుతో నవ్వేసింది. ఆ వీడియోని అభిమానులతో పంచుకున్నాడు బిలాల్.
ఈ వీడియోకి తెగ లైక్స్ కూడా వచ్చేసాయి. కారులో బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి కారులో నుండి తన భార్యని పిలిచాడు. బయటకి ఆమె రాగానే ఒక ఎర్ర గులాబీని ఆమెకు ఇచ్చాడు దీంతో వెంటనే ఆమె పొయ్యి మీద కూర వుంది. ప్రేమకి మాత్రం ముగింపు లేదంటూ అరటి పండ్లు ఇలా ఇచ్చేయండి అంటూ నవ్వింది. దీన్ని చూసి నేటిజన్లు ఒకటే నవ్వు..
View this post on Instagram
End of Article