హైదరాబాద్ లో ఉద్యోగస్తుల కష్టాలు…వచ్చే 10 వేల జీతంలో రోజుకి 200 ఛార్జీలకే పోతుంది..!

హైదరాబాద్ లో ఉద్యోగస్తుల కష్టాలు…వచ్చే 10 వేల జీతంలో రోజుకి 200 ఛార్జీలకే పోతుంది..!

by Megha Varna

Ads

జిల్లాలలో మాదిరిగానే హైదరాబాద్ నగర పరిధిలో కూడా సిటి బస్సులు నడపాలని కోరుతున్నారు నగరవాసులు.. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారు..వచ్చిన జీతం ట్రాన్స్పోర్ట్ కే పోతుందని వాపోతున్నారు.. కరోనా ఎఫెక్ట్​.. లాక్ డౌన్ ప్రకటణతో ట్రాన్స్ పోర్ట్ ఎక్కడిక్కడ ఆగిపోయింది.. లాక్ డౌన్ సడలింపులతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రన్ అవుతున్నప్పటికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మాత్రం..ఇంకా స్టార్ట్ కాలేదు..దాంతో ప్రైవేట్ వెహికిల్స్ ని ఆశ్రయించే వారికి ఛార్జీలతో చుక్కలు కనపడుతున్నాయి..

Video Advertisement

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా, హైదరాబాద్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో బస్సులు నడవట్లేదు. హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది చిన్నాచితకా ఉధ్యోగాలు చేసి బతికేవాళ్లే…లాక్ డౌన్​తో 3 నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు…ఉద్యోగాలు లేవు,ఆఫీసులు లేవు , జీతం లేదు..మూడు నెలలు జీతాలు లేక ఇబ్బంది పడితే..ఇప్పుడు వచ్చిన జీతం ఛార్జీలకే పోతుందని ఇబ్బంది పడుతున్నరు అనేకమంది.

లాక్ డౌన్ రిలాక్సేషన్ తో నెల రోజులుగా  ఆటోలు, క్యాబ్ లు తిరుగుతున్నాయి.ఆన్లైన్ లో బుక్ చేసుకున్న క్యాబ్స్ చూపించిన ధరకే తీసుకెళ్తున్నారు.కానీ అందరూ క్యాబ్ ఫెసిలిటి ఉపయోగించుకునే స్తోమత ఉ:డాలి కదా.. పోనీ తక్కువ ధరకి ఆటోల్లో వెళ్దామంటేజజ ,ఆటో వాళ్లు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారు.. శేర్ ఆటోలు ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురిని మించి ఎక్కించుకోకపోవడంతో డబ్బులు ఎక్కువే తీసుకుంటున్నారు..శేర్ ఆటోలు రాని ఏరియాలో వారి పరిస్థితి అయితే మరీ ఘోరం..

కుటుంబం గడవాలంటే జాబ్ చేయక తప్పని పరిస్థితి, పోనీ లిఫ్ట్ అడిగి వెళ్దామంటే కరోనా భయంతో ఎవరూ లిఫ్ట్ ఇవ్వని పరిస్థితి.. రెండు మూడు గంటల ముందే రోడ్డెక్కి లిఫ్ట్ కోసం వెయిట్ చేసినా నిరాశే ఎదురవుతోంది.. నడుచుకుంటూ వెళ్లేవాళ్లు తమ కాళ్లను నమ్ముకిన ఆఫీసులకు చేరుకుంటన్నరు..రోజు ఆఫీస్ కి వెళ్లి రావాలంటే సుమారు 200వందల వరకు ఖర్చవుతోంది..వచ్చే పదివేల జీతంలో సగం జీతం ఛార్జీలకే పోతుంది.

ఇన్ని బాధలు పడలేక హైదారాబాద్లో కూడా బస్సులు నడిపితే బాగుంటుందని..కరోనా వ్యాప్తి చెందకుండా తక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ లో కూడా బస్సులు నడపాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు.. ఉద్యోగస్తుల ఆవేదన ప్రభుత్వం ఎంతవరకు వింటుందో చూడాలి…కానీ రోజురోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే హైదరాబాద్లో ఇప్పట్లో బస్సులు నడిచే పరిస్థితి కనిపించట్లేదు..


End of Article

You may also like