కరోనా అలెర్ట్: హైదరాబాద్ లో కంటైన్మెంట్ లో ఉన్న 159 ప్రాంతాలు ఇవే.! పూర్తి వివరాలు!

కరోనా అలెర్ట్: హైదరాబాద్ లో కంటైన్మెంట్ లో ఉన్న 159 ప్రాంతాలు ఇవే.! పూర్తి వివరాలు!

by Megha Varna

Ads

లాక్ డౌన్ సడలించడంతో ప్రజలు వారి వారి కార్యక్రమాలు మునుపటిలానే కొనసాగిస్తున్నారు..దాంతో కేసుల తీవ్రత కూడా రోజురోజుకి పెరిగిపోతుంది.. రానున్న రోజుల్లో తెలంగాణాలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు..హైదరాబాద్ నగరంలో మొదట్లో నాలుగు ప్రాంతాల్లో మాత్రమే కేసుత తీవ్రత ఎక్కువగా ఉండేది..కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరిగిపోతూ కంటైన్మెంట్  జోన్ల సంఖ్య కూడా పెరిగింది.

Video Advertisement

ఇప్పటివరకు కేసుల తీవ్రతని బట్టి మొత్తం 159 కంటైన్మెంట్ జోన్లని ప్రకటించారు అధికారులు..వాటి వివరాలు ఆయా జోన్ల వారిగా …

  • సికింద్రాబాద్ జోన్లో 33 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో 6, ముషీరాబాద్‌లో 7, అంబర్‌పేటలో 13 మల్కాజ్‌గిరిలో 7 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
  • ఎల్బీనగర్ జోన్‌లో మొత్తం 21 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇందులో ఉప్పల్ సర్కిల్‌లో 16, సరూర్‌నగర్‌లో 4, హయత్‌నగర్‌లో ఒకటి చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
  • ఖైరతాబాద్ జోన్‌లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 35కి చేరింది. మెహదీపట్నంలో 5, కర్వాన్ అండ్ జియాగుడ డివిజన్లలో 17, ఖైరతాబాద్‌లో 5, జూబ్లీహిల్స్‌లో 8 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
  •  కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట డివిజన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
  • రాజేంద్ర నగర్‌ నగర్ జోన్‌లోని రాజేంద్రనగర్, మణికొండ ప్రాంతాల్లో ఏడు కంటైన్మెంట్ జోన్లు ఉండగా… శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ డివిజన్‌లో 4, శేరిలింగంపల్లిలో 5 చొప్పున మొత్తం 9 కంటైన్మెంట్ జోన్లున్నాయి.
  • కుత్బుల్లాపూర్‌లో 7, మహేశ్వరం జోన్‌లోని జలపల్లి మున్సిపాలిటీలో 6, బడంగ్‌‌పేటలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
  • చార్మినార్ జోన్‌లో 28 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మలక్‌పేటలో 1, సంతోష్ నగర్‌లో 16, చాంద్రాయణ గుట్టలో 2, చార్మినార్‌లో 5, ఫలక్‌నుమాలో 4 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతాలు మొత్తం కంటైన్మెంట్ జోన్ల కిందకి రావు..కొన్ని ఏరియాల్లో కేసులని బట్టి కంటైన్మెంట్ జోన్ల పరిధి ఉంది.. మరొకొన్నింటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇళ్లు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికి కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నది చిన్నపిల్లలు, ముసలి వారికే..కావున పిల్లలు, ముసలివారు ఇంటికే పరిమితం అయ్యేలా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..


End of Article

You may also like