Ads
భర్త విజయం వెనుక భార్య పాత్ర ఉంటుందని అని అంటారు. అలాగే భార్య సాధించిన విజయం వెనుక ఆమెను అర్థం చేసుకునే భర్త ఉంటాడని చెబుతారు. ఇక భార్య సాధించిన సక్సెస్ ను పురుషాధిక్యంతో ఒప్పుకోని భర్తలు చాలామంది ఉంటారు. కానీ ఒక భర్త తన భార్య సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసి ఆమెను సర్‌ప్రెజ్ అయ్యేలా చేశాడు.
Video Advertisement
ఇలాంటి భర్తలు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజెన్లు ఆ భర్తను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌కు చెందిన దీనా, మహిళ పోలీస్ కానిస్టేబుల్‌గా జాయిన్ అయ్యింది. కానిస్టేబుల్‌గా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు రీసెంట్ గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తో హెడ్ కానిస్టేబుల్ అయిన దీనా ట్రైనింగ్‌కు వెళ్లింది. ఆమెకు 18 నెలల బిడ్డ ఉంది. ఆ బిడ్డ బాధ్యతను కుటుంబానికి అప్పగించి, 45 రోజులు ట్రైనింగ్ కి వెళ్ళింది. ఆమె ట్రైనింగ్ పూర్తి అవగానే, ఇంటికి చేరుకున్న ఆమెకు, భర్త రొనాల్ట్ బాసిల్ ఘనంగా తో స్వాగతం చెప్పాడు. ఇంటి చుట్టు ఉన్నవారిని పిలిచి, బాణా సంచా, బ్యాండ్ ఏర్పాటు చేసి స్వాగతం చెప్పాడు.భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.
#Hyderabad– Husband welcomes wife’s promotion as head constable with teen maar, heartwarming video goes viral. pic.twitter.com/VvqdOUtz4i
— @Coreena Enet Suares (@CoreenaSuares2) July 21, 2023
End of Article