ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయమే అతన్ని కాపాడింది…హైదరాబాద్ ఐసొలేషన్ వార్డ్ లో కరోనా పేషెంట్ అనుభవం..!

ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయమే అతన్ని కాపాడింది…హైదరాబాద్ ఐసొలేషన్ వార్డ్ లో కరోనా పేషెంట్ అనుభవం..!

by Megha Varna

Ads

బిబిసి కధనం (ఇంటర్వ్యూ) ప్రకారం పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం . బ్రిటన్ నుండి పది రోజుల క్రితం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఒక యువకుడిలో కరోనా లక్షణాలు లేవని అధికారులు ఇంటికి వెళ్లిపోవచ్చు అన్నారు ..కానీ ఆ యువకుడు అంతటితో ఆగకుండా గాంధీ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నడు ..ఫలితం కరోనా పాజిటివ్ వచ్చింది..అక్కడే ఐసొలేషన్ విభాగంలో వుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు …

Video Advertisement

నాకు వైరస్ ఉందన్న విషయం నాకు తెలియదు . ఒకవేళ ఉంటే అది ఎవరికీ నా ద్వార ఎవరికీ సోకకూడదు అనుకున్నాను . నాకు కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత నేను తీసుకున్న జాగ్రత్తలు నన్ను నేను అభినందించుకొనేలా చేసాయి అని అయన బీబీసీ తో అన్నారు . 24 సవంత్సరాలు వయసు కలిగిన అఖిల్ ఎన్నంశెట్టి వృత్తిరీత్యా న్యాయవాది .. ఎడిన్‌బరో యూనివర్శిటీలో ‘హ్యూమన్ రైట్స్ లా’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు..బ్రిటన్ నుంచి వచ్చేటప్పుడు తనకు కరోనా వైరస్ సోకలేదని దిలాసాగా తిరగలేదు . అలాగని వైరస్ సోకిందేమోనని భయపడిపోలేదు . బాథ్యతయుతంగా నడుచుకున్నారు .

తనకు తానుగా వెళ్లి పరీక్షా చేయించుకున్నరు . పాజిటివ్ వచ్చిందని కృంగిపోలేదు ..అయినవాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుంది అని బాధపడలేదు ..ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇస్తున్నారు . అఖిల్ కరోనా వైరస్ తో తన స్వీయ పోరాట అనుభవాలను బీబీసీ తో పంచుకున్నారు …అనుకోని పరిస్థితుల్లో బ్రిటన్ నుండి భారత్ కు రావడం , పరీక్షా చేయించుకున్న విధానం , వైద్య సదుపాయాలు , ఐసొలేషన్ వార్డులో వాతారణం మరియు వివిధ అంశాల గురించి తెలిపారు. సరైన అవగాహనతో జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ ని జయించడం సాధ్యమేనని అంటున్నారు అఖిల్ …ఆ వివరాల్లోకి వెళ్తే ..

కరోనా వైరస్ ని అదుపు చెసే విధానంలో మొదట్లో బ్రిటన్ హెర్డ్ ఇమ్మ్యూనిటి విధానాన్ని పాటించంది అని .అంటే ఎక్కువ మందికి వైరస్ సోకాలని తద్వారా వారి ఇమ్మ్యూనిటి సిస్టమ్ వైరస్ తో పోరాడేదిగా తయారు అవుతుంది అని భావించింది . అందువలనే జనాలు ఒక చోట జెరడాన్ని ప్రభుత్వం అడ్డుకోలేదు . అంటే సోషల్ డిస్టెన్స్ ను పాటించలేదు …విశ్వవిద్యలయాలు , సినిమా థియేటర్లు , బార్లు , ఆఫీసులు ఇలా వీటిని మూసివేయ్యలేదు ..దీంతో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందింది .

కానీ పరిస్థితి కంట్రోల్ చెయ్యలేని స్థితిలోకి వెళ్లిపోవడంతో బ్రిటన్ తన వైఖరి మార్చుకొని జనం గుమిగూడే ప్రదేశాలన్నింటిని మూసివేసి పూర్తి లాక్ డౌన్ దిశగా చర్యాలు చేపట్టింది . లాక్ డౌన్ సమయంలో మనం ఇక్కడే ఉండలా లేక వెళ్లిపోవడం మంచిదా అని బ్రిటన్ లో చదువుతున్న మన భారతీయ విద్యార్థులలో ఆలోచన మొదలై ఇక్కడ ఉండడం కష్టం అవుతుంది అని భావించారు .

ఇలా ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర దేశాల నుండి వచ్చేవారిని మర్చి 18  తర్వాత అనుమతించబోమని మర్చి 16 న   భారత్ అకస్మాత్తుగా ప్రకటించింది ..దీంతో మాలో చాల మంది వెంటనే ఇండియాకి టిక్కెట్లు బుక్ చేసుకున్నాం . మార్చి 17న లండన్‌ హీత్రూ విమానాశ్రయం బయలుదేరి ముంబయి మీదుగా హైదరాబాద్ చేరుకొనే విమానానికి నేను టికెట్ తీసుకున్నా. మాలో చాలామందికి రద్దీ ఎక్కువగా ఉండడం వలన టిక్కెట్లు దొరకలేదు …వాళ్ళు ఇప్పటికి బ్రిటన్లోనే వున్నారు ..భారత్ మళ్ళి తిరిగి ఎప్పుడు అనుమతిస్తుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.


భారత్ కు బయలుదేరే సమయానికి నాకు వైరస్ సోకిందని ఊహించలేదు కానీ కొంచెం టెన్షన్ అయితే వుంది గాని బయమైతే లేదు .ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ప్రయాణం అంటే చాల జాగ్రత్తలు తీసుకోవలసి వస్తుంది అని నాకు తెలుసు దానికి అన్ని విధాలా సిద్ధపడ్డాను . వీలైనంత వరుకు ఇతరులకు దూరంగా ఉండేందుకు వేటిని తాకకుండా ఉండేందుకు , వస్తువులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేశాను ..కానీ అందరు ఈ జాగ్రత్తలు పాటించారు .

అమ్మా-నాన్నలకు ముందే చెప్పాను. నాలో వైరస్ ఎంటర్ అయిందో లేదో తెలియక ముందే టికెట్ బుక్ చేసుకున్నాను  . ఆ  సమయంలో అమ్మ నాన్న కి ఫోన్ చేసి చెప్పను నన్ను తీసుకువెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి   రావద్దని , నేను హైదరాబాద్ చేరుకున్నక కారోనా వైరస్ టెస్ట్ చేయించుకుంటాను ఒకవేళ నెగిటివ్ వస్తే ఇంటికి వస్తాను లేదంటే ఐసొలేషన్ వార్డుకు వెళ్తాను అని.

ముంబై విమానాశ్రయంలో చాల గంటలు గడపాల్సి వచ్చింది .నన్ను కలవడానికి వస్తానన్న స్నేహితులని రావద్దు అని ముందుగానే ఫోన్ చేసి సమాచారం అందించాను . నా ఆరోగ్య పరిస్థితి అంత బాగానే వుంది అని నాకు అనిపించినప్పటికీ …ఆ సమయానికి విస్తరించిన కరోనా వైరస్ కారణంగా జాగ్రత్తలు తీసుకున్నాను . ఒకవేళ బ్రిటన్లోనే లేదా ప్రయాణంలోనో నాకు వైరస్ సోకి ఉంటే నా ద్వారా ఎవరికీ వైరస్ సోకకూడదని అనుకున్నాను … అదేవిదంగా నడుచుకున్నాను ..

హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులలో ఎలా మసలుకోవాలి అనేది ‘ఎమర్జెన్సీ పారామెడిక్‌’గా బ్రిటన్‌లో పొందిన ట్రైనింగ్ నాకు ఉపయోగపడింది . హైదరాబాద్‌ వచ్చాక.. క్వారంటీన్ అవసరం లేదన్నారు. ”మార్చి 19 మార్నింగ్ హైదరాబాద్‌ చేరుకున్నాను. గొంతులో కొంచెం ఇబ్బందిగా ఉండడంతో హెల్ప్ డెస్క్ ను సంప్రదించాను ..థర్మల్ స్క్రీనింగ్ చేసి ఉష్ణోగ్రత బాగానే వుంది అని చెప్పారు . బ్రిటన్ నుంచి వచ్చినవారు ఎవరిని కలవకుండా ఎటు వెళ్లకుండా ఒకే చోట కొన్ని రోజులు ఉండాలనే ఆంక్షలు లేవని ఇంటికి వెళ్ళచ్చని , ఇంట్లోనే క్వారంటీన్ పాటించాలి అన్నారు.

ఆ తర్వాత కొంత సమయం ఒక హోటల్ లో స్టే చేశాను ..ముందు జాగ్రత్తగా ఎవరని నా గదిలోకి రావద్దు అని నా వస్తువులు ముట్టుకోవద్దని చెప్పాను …కాసేపటి తర్వాత హోటల్ నుండి గాంధీ హాస్పిటల్ కు చేరుకొని కరోనా పరీక్షా చేయించుకున్నను ..వైరస్ సోకాదని నమ్మకం ఉన్నప్పటికీ , వైరస్ సోకిందో లేదో పరీక్షతోనే నిర్దారించుకోవాలి అని చేయించుకున్నను .

టెస్ట్‌లో నెగటివ్ వస్తుందని అనుకున్నా.. కానీ…నెక్స్ట్ డే మార్నింగ్ రిసల్ట్ వచ్చింది పాజిటివ్ అని ..తెలంగాణలో కరోనా వచ్చిన 16 వ వ్యక్తిని నేనే …అమ్మ నాన్న నేను అందరం వైరస్ సోకివుండదని ఎందుకైనా మంచిది అని టెస్ట్ చేయించుకుంటున్నాం అని నెగిటివ్ రాగానే ఇంటికి వెళ్లిపోవచ్చు అని అనుకుంటుండగా పాజిటివ్ వచ్చి ఆశ్చర్యపరిచింది …పరీక్షా ఫలితం వచ్చాక నేను బస చేసిన హోటల్ వివరాలను నా ప్రయాణ మార్గాలను నేను కలిసిన వ్యక్తుల వివరాలు అన్ని చెప్పను నా  వలన ఎవరిని ఐసొలేషన్స్లో ఉంచాల్సిన అవసరం రాలేదు ….నాది యంగ్ ఏజ్ అని ఇంకా నాకు ఏ ఆరోగ్య సమస్యలు లేకపోవడం వలన త్వరగా కోలుకుంటానని నమ్మకం వుంది ..

మొదట్లో ఈ వ్యాధికి సంబంధించి ఏ లక్షణాలను చూపదు ..అదే ఈ వ్యాధి ప్రత్యేకత అనుకుంటా …తోటి పేషెంట్స్ లో కూడా నేను ఇదే గమనించాను …ఈ వ్యాధి సోకినా కొన్ని రోజుల తర్వాత  శరీరం ఈ వ్యాధితో పోరాడడం మనకు తెలుస్తుంది అప్పుడే మనం మనోనిబ్బరం కోల్పోకూడదు . గాంధీ హాస్పిటల్లో వాతావరణం బాగుంది . పేషెంట్ ల మనో నిబ్బరం పెరిగేలా వుంది …బెడ్ షీట్స్ తదితర వస్తువులు ఎప్పటికప్పటికీ మార్చడం శుభ్రత పట్టించడంతోపాటు సరిఅయిన సమయానికి ఫ్రూట్స్ ఇవ్వడం మరియు మంచి ఆహారం అందచేస్తున్నారని అన్నారు …

నా కుటుంబన్ని స్నేహితులని మిస్ అవుతున్ననని అయిన ఫోన్లో మెసేజ్స్ లో , కాల్స్ లో టచ్లో వుంటున్నాని చెప్పారు .ఎవరిని కలవకుండా టెస్ట్ చేయించుకోవాలనే నా నిర్ణయం నాకు గర్వంగా వుంది అని అన్నారు . మీడియా కథనాలతో జనాలలో బయాందోళనలు పెరిగిపోతున్నాయి ..అనవసరమైన సమాచారంతో ప్రజలలో అలజడి పెరుగుతుంది అన్నారు ..సోషల్ మీడియాలో తప్పుడు సమాచారన్ని స్ప్రెడ్ చేస్తున్నారని దాని ద్వారా నాకు తెలిసిన పేషెంట్ తల్లి కూడా తీవ్ర మనస్తాపనకు గురిఅయినట్లు చెప్పారు ..సరి అయినా జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కరోనా ఒకరి నుండి ఒకరికి వ్యాపించింది కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది అని అన్నారు ..

 

థర్మల్ స్రీనింగ్‌లో ఉష్ణోగ్రత మాత్రమే తెలుస్తుంది .ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నంత మాత్రాన కరోనా లేదు అని కాదు నా విషయంలోనే కాదు వేరే వారి విషయంలో జరిగినది కూడా అదే ..ఎయిర్ పోర్ట్ లో వేరే పరీక్షలు కూడా చేసి వుండాల్సింది .అల చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదన్నారు . కరోనా తో హాస్పిటల్ లో చేరిన వారిని దోషులుగా చూడకూడదు ..వెంటనే హాస్పిటల్ లో చేరడం వలన ఎంతోమందిని రక్షించినవాళ్లు అవుతారు ..

కరోనా వైరస్ ఒక ప్రపంచ విపత్కర పరిస్థితి దానిపై మనమందరం సమిష్టిగా కలిసి పోరాడలి. దీనిని తేలికగా తీసుకోకూడదు ..ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అందరు పాటించాలి .డిశ్చార్జి చేయాలంటే 48 గంటల్లో వరుసగా రెండుసార్లు కరోనావైరస్ పరీక్షలో ‘నెగటివ్’ రిజల్ట్ రావాలి. తెలంగాణలో ఇంతవరకు ఒక్కరే కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. నేను కూడా ఒక వారంలో డిశ్చార్జ్ అవుతానని ఆశిస్తున్నాను .జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు చాలానే వున్నాయి. థాంక్యూ. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి.

source: bbctelugu


End of Article

You may also like