హాస్పటల్స్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోతున్నారు. మీరు చదివింది నిజమే. భయపడినంతా జరుగుతుంది. ఏ వ్యాధినైనా వ్యాప్తి చెందకుండా చూడడమే ప్రధమ కర్తవ్యం . ఒక్కసారిగా వ్యాధి ప్రభలితే పరిస్థితులు మన చేయి దాటి పోతాయి. ఇప్పటికే ఇటలీ,స్పెయిన్ లాంటి దేశాలు చేతులెత్తేశాయి. మన దేశంలో పరిస్థితి ఇంకా మన చేతుల్లోనే ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ హాస్పిటల్స్ నుండి కరోనా పేషెంట్స్ పారిపోవడానికి గల రీజన్స్ ఏంటో తెలుసా?

ప్రపంచ దేశాలన్ని ఏకధాటిపైకి వచ్చి కరోనాపై ఫైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కరోనాకి వాక్సిన్ కనుక్కోని కారణంగా వ్యాధి నివారణకు ఏఏ దేశాలు ఏ మందులు వాడుతున్నారు, ఏ మందులకి కరోనా నయం అవుతుందనే సమాచారాన్న అంతర్జాతియంగా ఆయా దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నరు. మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడిక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు . అయినా దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.

ఎక్కడ కరోనా ఇతరులకు సోకుతుందో అని కరోనా పేషెంట్స్ ని ఐసోలేషన్లో ఉంచుతున్నారు. అక్కడ ఒంటరిగా నిర్భందించడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు హాస్పటల్స్ నుండి పారిపోతున్నరు. దేశ రాజదాని ఢిల్లీ నుండి మొదలు పెడితే, కేరళలోని అళప్పుళ, కడప, జగిత్యాల ఇలా ప్రతిచోట ఇదే పరిస్థితి. ఐతే కరోనా రోగులు పారిపోవడం వెనుక ఒక్కో చోట ఒక్కో కారణాలు కనపడుతున్నాయి.

మహారాష్ట్రలోని నాగపూర్ లో కరోనా వైరస్ లక్షణాలతో నలుగురు వ్యక్తుల్ని డాక్టర్లు హాస్పటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అయతే ఈ నలుగురు డాక్లర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హాస్పటల్ నుండి వెళ్లిపోయారు. దీంతో కరోనా ఇతరులకు సోకుతుందేమోని భయంతో డాక్టర్లు పోలీసులకి సమాచారం ఇచ్చారు. కరోనా బాదితులందరికి ఒకే టాయిలెట్ ఏర్పాటు చేయడంతో, ఎక్కడ సమస్య మరింత ఎక్కువవుతుందో అనే భయంతో పారిపోయామని వారు పోలీసులకు చెప్పారు. మరికొంతమంది కరోనా పాజిటివ్ అని వస్తే ఎక్కడ తమ కుటుంబసభ్యులు దూరం అవుతారో, లేదంటే చుట్టుపక్కల వాళ్లు దాడి చేస్తారో అనే భయంతో పారిపోతున్నారు. ఇప్పటివరకు మందు కనుగొనకపోవడంతో, ఎక్కడ తమ పైనే పరీక్షలు చేస్తారో అనే భయం కొంతమందిని పారిపోయేలా చేస్తోంది.

 

హస్పటల్స్ లో సౌకర్యాలు లేకపోవడమే ప్రధాన కారణంగా కనపడుతోంది . పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు మరింత దారుణంగా మారొచ్చు. అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. కొద్ది రోజుల పాటు జనసమూహా ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొంత వరకు సమస్యను అధిగమించినవారమవుతాం. హైదరాబాద్ లోని ఫీవర్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లో పరిస్థి ఎలా ఉందొ అక్కడ ఒక బాధితురాలు ఇలా వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

watch video:

Viral Video of Corona victim | V6 News

Viral Video of Corona victim#FeverHospital #ViralVideo #V6News #CoronaVirus

V6 News ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಗುರುವಾರ, ಮಾರ್ಚ್ 26, 2020

Sharing is Caring:
No more articles