Ads
ఏ పని లేకున్నా బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డెక్కుతున్నారా? కుదురుగా ఇంట్లో కూర్చోండి అంటే బండి తీసుకుని రోడ్లన్ని చక్కర్లు కొడుతున్నారా?? పోలీసులు ఆపితే ఫలానా పని మీద వచ్చాం అంటూ అబద్దాలు చెప్తున్నారా?? ఇకపై మీ పప్పులు ఉడకవు..పోలీసులు మీ ప్రాణాల కోసం ఇప్పటివరకు ఓపికగా లాక్ డౌన్ పాటించమని చెప్పారు, కొన్ని చోట్ల సహనం కోల్పోయి లాఠీలకు పనిచెప్పారు..ఇకపై అదేం ఉండదు…సరాసరి స్టేషన్ కే..
Video Advertisement
ఇన్ని రోజులు పిల్లలు పాలకూర అడిగారన్నా? పెళ్లాం ఆశీర్వాద్ ఆటా అడిగిందని అబద్దాలు చెప్పినా చెల్లింది..నవ్వి ఊరుకున్నారు, కాని ఇకపై లాక్ డౌన్ నిబందనలు ఉల్లంఘించడానికి వీల్లేకుండా పగడ్బందీ ప్లాన్ వేసింది తెలంగాణా సర్కార్. మేం తిరిగితే వారికెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అందుకోసమే ప్రత్యేకంగా ఒక యాప్ క్రియేట్ చేసారు. లాక్ డౌన్ నిబంధనలని పాటించని వాళ్లని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయింది డిపార్ట్మెంట్. అందులో భాగంగానే ఒక ప్రత్యేక యాప్ ని తయారు చేయించింది. ఈ యాప్ సహాయంతో ఇకపై3 కిలోమీటర్లు కంటే ఎక్కవ ప్రయాణిస్తేకేసులు బుక్ చేయనున్నారు. ఈ యాప్ నేమ్ “ఆటేమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ యాప్”.క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అందరి ఫోన్లు, ట్యాబ్ లలో సేవ్ చేశారు.
ఇకపై మీరు బండి తీసుకుని రోడ్డెక్కగానే అక్కడికి దగ్గరలో పోలీసులు మీ వివరాలు, ఫోన్ నెంబర్, తదితర సమాచారాన్ని నమోదు చేస్కుంటారు. కొంతదూరం వెళ్లాక అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు పేరు, వాహనం నెంబర్ వంటివి నమోదు చేస్తారు. GPS ద్వారా పనిచేసే ఈ యాప్ మీరు ఎంతదూరం ప్రయాణించాడో లెక్కకడుతుంది. దీనిని బట్టి మీరు 3 కి.మీటర్లు దూరాన్ని మించి ప్రయాణించినట్టు తెలిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టే. అదే విషయం తేలితే మీపై కేసు బుక్ చేస్తారు.మీ వెహికిల్ వాహనాన్ని సీజ్ చేస్తారు . వెంటనే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్‌లో కేసు నమోదు చేస్తారు. సో ఇకపై బండి తీసేముందు ఆలోచించి తీయండి..
ఇన్ని రోజులు ప్రాణాలు..ఇప్పుడు బండ్లు కూడా.. తస్మాత్ జాగ్రత్త..లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి దేశంలో ఆరువేలకు పైగా కేసులు నమొదయ్యాయి..మన రాష్ట్రంలో 471 కేసులు..ఈ లెక్క ఇలాగే పెరుగుతూ పోతే థర్డ్ స్టేజ్ లోకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు..కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్స్ అమలు చేస్తుంది..మన పని ప్రభుత్వం చెప్పినట్టు వినడమే..కాబట్టి చెప్పిన మాట వినండి ప్రాణాలు రక్షించుకోండి.
కాబట్టి మీకు ఏ సామాన్లు కావాలన్నా…3 కిలోమీటర్ల లోపు ఉన్న షాపుల్లోనే కొనుక్కోవాలి. అంతే కానీ మూడు కిలోమీటర్లు దాటారో ఇక అంతే మీ పని. మందుల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. మీ దగ్గర్లో మందులు దొరకకపోతే పోలీసులను రిక్వెస్ట్ చేస్తే పంపిస్తుండచ్చు. ఇదంతా ప్రజల మంచి కోసమే అంటున్న పోలీసులు దయచేసి ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలని మరీ మరీ కోరుతున్నారు.
End of Article