పేషెంట్ లాగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్…ఏం బయటపెట్టారంటే.?

పేషెంట్ లాగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్…ఏం బయటపెట్టారంటే.?

by Mohana Priya

Ads

సాధారణంగా సినిమాల్లో పోలీసులు కానీ, లేదా ఎవరైనా ఒక అధికారులు మఫ్తీలో వెళ్లి, ఎక్కడైనా జరుగుతున్న కొన్ని తప్పుడు పనులని బయట పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సినిమాల్లో మాత్రమే జరుగుతాయి అని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి ఒక సంఘటన ఇటీవల జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా హాస్పిటల్ లో జరుగుతున్న ఒక మోసాన్ని బయట పెట్టారు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అందులో నిర్వహణ సరిగ్గా లేదు అంటూ కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.

Video Advertisement

ias officer hospital incident

అక్కడ ఉన్న పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ కంప్లైంట్స్ వెళ్లాయి. ఉదయం 10 గంటలు అయ్యాక కూడా డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు అని అంటున్నారు. దాంతో, ఆ ఆసుపత్రిని తనిఖీ చేయాలి అని అక్కడి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అయిన కృతి రాజ్ అనుకున్నారు. దాంతో, ఒక పేషంట్ లాగా హాస్పిటల్ కి వెళ్ళారు. ఎవరు గుర్తుపట్టకుండా ముఖానికి ముసుగు వేసుకున్నారు. ఒక డాక్టర్ చెకప్ చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రవర్తన సరిగ్గా లేదు అని కృతి అర్థం చేసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ చూసి అందులో కొందరు అసలు హాజరు కూడా కాలేదు అని, సంతకాలు ఉన్నా కూడా ఆ సిబ్బంది అక్కడ లేదు అనే విషయాన్ని కృతి గ్రహించారు.

ias officer hospital incident

దాంతో అక్కడ సిబ్బంది సేవలు సరిగ్గా లేకపోవడంతో కృతి ఆగ్రహానికి గురయ్యారు. హాస్పిటల్ మాత్రమే కాకుండా, మెడికల్ స్టోర్ కి కూడా వెళ్లి, అక్కడ తనిఖీ చేసి, సగానికి పైగా ఉన్న మెడిసిన్స్ గడువు ముగిసింది అని చూశారు. హాస్పిటల్ కూడా పరిశుభ్రంగా లేదు అనే విషయాన్ని కూడా కృతి పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నివేదిక పంపుతాను అని కృతి చెప్పారు. ఇదంతా వింటూ ఉంటే సినిమాలో జరిగిన సంఘటనలానే అనిపిస్తోంది కదా? కానీ ఇది నిజంగానే జరిగింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది. దాంతో కృతి చేసిన ఈ పనిని చూసి ఆమెని అందరూ మెచ్చుకుంటున్నారు.

watch video :

ALSO READ : SUCCESS STORY: ఒకప్పటి మోడల్…మిస్ ఇండియా అవ్వాలన్న కలను వదిలేసుకొని ఐఏఎస్ ఆఫీసర్ గా.! హ్యాట్సాఫ్ మేడం.!


End of Article

You may also like