Ads
టిక్ టాక్ ఈ యాప్ ఒక సంచలనం.ఈ యాప్ వచ్చినప్పటి నుండి చిన్న ,పెద్ద,మహిళలు,పెళ్ళైన వారు,పెళ్లి కానివారు ఇలా ఏ తేడా లేకుండా అందరూ టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నారు.ఈ యాప్ లో ఎక్కువ మంది ఫాలోవర్లను పొంది ఫేమస్ అయ్యినవాళ్ళని టిక్ టాక్ స్టార్లుగా పిలుస్తూ ఇంటర్వూస్ కి కూడా పిలుస్తున్నారంటే ఈ మేనియా ఏ రేంజ్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.అయితే టిక్ టాక్ వీడియోలు చేసే చాలామంది హద్దులు దాటి వీడియోస్ చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారు.కొందరైతే తమ జీవితాలను సైతం రిస్క్లో పెట్టుకుంటున్నారు.అయితే తాజాగా ఓ కుక్కను తాళ్లతో కట్టేసి చెరువులో విసిరేసి ఓ ఇద్దరు యువకులు టిక్ టాక్ వీడియోను చేసారు.అయితే సదరు వీడియో ఇప్పుడు సంచలనంగా మారి ఓ యానిమల్ సంస్థకు వద్దకు ఈ వీడియో చేరింది.వివరాల్లోకి వెళ్తే..
Video Advertisement
ఓ ఇద్దరు యువకులు కుక్కను తాడుతో కట్టేసి ఒక చెరువులోకి విసిరేస్తారు.అప్పుడు ఆ కుక్క బతకడానికి ప్రయత్నిస్తున్న కూడా రాళ్ళూ వేసి చంపేస్తారు.అయితే ఈ వీడియో అప్లోడ్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ అఫ్ యానిమల్స్ సంస్థ తీవ్రంగా మండిపడింది.కుక్కపై అమానుషంగా ప్రవర్తించిన ఆ యువకుల జాడను తెలియచేస్తే 50 వేల రూపాయలు బహుమానం గా ఇస్తామని ప్రకటించారు.info @petaindia .org కి మెయిల్ చేయాల్సిందిగా కోరారు.అయితే సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని దానిపై భయపడాల్సిన పని లేదు అని ఈ సంస్థ వెల్లడించింది.
#tiktokbanindia
Got this Video via whatsapp , Please Ban tiktok . pic.twitter.com/j8uYP13FKE— Tarun choubey (@Tarunchoubey4) May 20, 2020
source: v6 news
End of Article