నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో ట్విస్ట్…ఆ యువకుడు గర్ల్స్ హాస్టల్ లోకి ఎందుకొచ్చాడు? అతనెవరు?

నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో ట్విస్ట్…ఆ యువకుడు గర్ల్స్ హాస్టల్ లోకి ఎందుకొచ్చాడు? అతనెవరు?

by Megha Varna

Ads

నూజివీడు ట్రిపుల్ ఐటీ లేడీస్ హాస్టల్ లో యువకుడి సంచారం కలకలం రేపుతోంది. హస్యంగా హాస్టల్ లోకి ప్రవేశించిన సదరు యవకుడు ఒకరోజంతా హాస్టల్ లోనే ఉన్నాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఈ విషయం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

నూజివీడు ట్రిపుల్ ఐటీలో అర్థరాత్రి విద్యార్థినుల హాస్టల్‌లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. కిటికీ ఊచలు తొలగించి అమ్మాయిల గదిలోకి వెళ్లాడు. అలా 12 గంటల పాటు గదిలోనే ఉండిపోయాడు. యువకుడు లోపలికి రావడానికి మరో విద్యార్థిని సహకరించినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని గమనించిన ఇతర విద్యార్థినులు గదికి తాళం వేసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. తాళాలు పగులగొట్టి యువతి, యువకుడిని పట్టుకున్నారు. మంచం కింద దాక్కొని ఉన్నాడు అతను ఆ సమయంలో. అనంతరం వారి వారి తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు యువకుడికి సహాయం చేసిన యువతిని క్యాంపస్ నుంచి పంపించేశారు.

నూజివీడు పట్టనానికి దూరంగా ఉండే ఈ ట్రిపుల్ ఐటీ కాలేజ్..హాస్టల్ నిత్యం వివాదం కొనసాగుతున్నాయి. ఏదోక ఘటనలతో తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. విద్యార్థులు కొట్టుకోవడం సహజం అయిపొయింది.

ఇదిలా ఉంటె…మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. లేడీస్‌ హాస్టల్లో పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థేనని తెలిసింది. విద్యార్థినిల సహకారంతో అతడు వసతి గృహంలోకి చేరినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆరుగురు విద్యార్థినిలను వర్సిటీ యాజమాన్యం సస్పెండ్‌ చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఎవరినీ సస్పెండ్‌ చేయలేదని సమాచారం. కేవలం కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చారంట. లేడీస్‌ హాస్టల్లో రోజంతా గడిపిన ఓ యువకుడిపై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక సెక్యురిటీ సిబ్బంది, కేర్‌ టేకర్లపై చర్యలు శూన్యమనే చెప్పాలి!

ఇదిలా ఉంటె..హాస్టల్లో ఉంటే తమ పిల్లలు భద్రంగా ఉంటారని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇలాంటివి జరిగితే వారిలో ఆందోళన మొదలవుతుంది. వార్డెన్ ల భరోసా పోతుంది. ఈ ఘటనపై ఇతర విద్యార్థుల పేరెంట్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడు ఎవరు? ఎందుకొచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? అనే విషయాలు ఇంకా సరిగా తెలీదు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అంట.

watch video:


End of Article

You may also like