చైనాలో ఆ కంపెనీ చేసిన పనికి నెటిజెన్స్ ఫైర్…ముద్దు పోటీలు ఏంటి? సోషల్ డిస్టెన్స్ ఏది?

చైనాలో ఆ కంపెనీ చేసిన పనికి నెటిజెన్స్ ఫైర్…ముద్దు పోటీలు ఏంటి? సోషల్ డిస్టెన్స్ ఏది?

by Sainath Gopi

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు తమ దేశ ప్రజలను సామాజిక దూరం పాటించమని, ఇతరులతో మాట్లాడే సమయంలో నోటికి మాస్కులు ధరించాలని సూచిస్తున్నాయి. అంతేగాక జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రదేశాలనే కాక మొత్తం దేశంలోనే లాక్ డౌన్ విధించడంతో ఎక్కడ జనసాంద్రత అక్కడే నిలిచిపోయింది. ప్రజలకి అవసరమయిన సదుపాయాలు తప్ప మిగిలిన ఏ ఇతర సదుపాయాలను కూడా మూసివేశారు.

Video Advertisement

అయితే చైనా దేశంలో క్రమ క్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుండంతో లాక్ డౌన్ ఎట్టి వేశారు. దీంతో తాజాగా ఓ ఫర్నిచర్ సంస్థ తమ కార్యకలాపాలను తిరిగి పునః ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు తమ సంస్థలో పని చేసేటువంటి ఉద్యోగులకు ముద్దుల పోటీలను నిర్వహించిది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా ఈ ముద్దుల పోటీలను కొంచెం డిఫరెంట్ గా నిర్వహించింది.

ఇందులో ముద్దు పెట్టుకునెటువంటి వారి మధ్యలో ఓ పలుచటి అద్దాన్ని ఉంచుతూ ఈ పోటీలను నిర్వహించింది. అంతేగాక ఈ పోటీలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా తమ ఉద్యోగులు ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఈ ముద్దుల పోటీలు నిర్వహించినట్లు సంస్థ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేగాక కొందరి నెటిజన్లు ఫర్నిచర్ కంపెనీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో ముద్దుల పోటీలు నిర్వహించడం ఏమిటని ఫర్నిచర్ కంపెనీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మాత్రం ఏకంగా సామాజిక దూరం పాటించండని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వినకుండా ఇలాంటివి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీంతో పబ్లిసిటీ కోసం ముద్దుల పోటీలు నిర్వహించినటువంటి ఫర్నిచర్ సంస్థకు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.


You may also like

Leave a Comment