Ads
కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అప్పటివరకు మన పక్కనే ఉన్న మన పిల్లలు క్షణకాలంలో ప్రమాదానికి లోనవుతూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు నిరంతరం తమ పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రమాదవశాస్తూ ఒక చిన్నారి స్కూలు బస్సు కిందపడి మరణించిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.
Video Advertisement
ఈనాడు కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పట్టణంలోని హబ్సిగూడా నందు రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారి తన తండ్రి అమ్మమ్మతో కలిసి తన సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి రోడ్డు మీదకు వచ్చింది. ఒకపక్క అమ్మమ్మ పిల్లవాడిని స్కూల్ బస్సు ఎక్కిస్తుంటే మరోపక్క తండ్రి మిథున్ స్కూలు బస్సు డ్రైవర్ తో మాట్లాడుతున్నారు.
ఈ లోగా చిన్నారి నాన్న వద్దకు వెళ్తానంటూ పరుగు పరుగున అటువైపు వెళ్ళింది. చిన్నారి రాకను గమనించని డ్రైవర్ బస్సులు ముందుకు పోనిచ్చాడు. అనుకోకుండా చిన్నారి స్కూల్ బస్సు టైర్ కింద పడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మరణించింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మునిరవుతున్నారు.
End of Article