Ads
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లులు మాల్ సెప్టెంబర్ 27న ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మాల్ ఓపెన్ అవడమే ఆలస్యం నగర వాసులు మాల్ లో పోటెత్తారు.
Video Advertisement
ఈ క్రమంలో 3 రోజులు సెలవులు కావడంతో రద్దీ బాగా పెరిగింది. ఇక ఆదివారం (అక్టోబర్ 1)నాడు ఈ మాల్‌కు వేలాదిగా నగర వాసులు షాపింగ్ కోసం పోటెత్తారు. మాల్ లోపల మరియు బయట జనంతో కిక్కిరిసిపోయింది. అయితే ఈ క్రమంలో కొంత మంది చేసిన పనులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో లులు మాల్ నగరవాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్‌గా నిలుస్తోంది. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఓపెనింగ్ రోజు ఈ మాల్ కి విపరీతమైన ప్రచారం లభించింది. నెట్టింట్లో కూడా ఈ మాల్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవుల రావడంతో పెద్ద సంఖ్యలో లులు మాల్ ను సందర్శిస్తున్నారు. ఈ మాల్ కు వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాడు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఆదివారం నాడు వీకెండ్ కావడంతో మాల్ కు జనం ఒక్కసారిగా వేల సంఖ్యలో పోటెత్తారు. మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు ఇలా అన్నీ చోట్ల పూర్తిగా జనాలతో మాల్ నిండిపోయింది. ఈ రద్దీలో కొంతమంది మాల్ లో అందినంతవరకు దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లుగప్పి మరీ దోచేశారు. మాల్‌లో ఉన్న ఆహార పదార్థాలన్నిటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఏది చేతికి దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో నగర వాసులు మన పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసారని కామెంట్లు చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/Cx7NvUgxiu3/?igshid=NTc4MTIwNjQ2YQ==
Also Read: ఆడి కారులో కూరగాయలు అమ్ముతున్న హైటెక్ రైతు…అతను ఎవరో తెలుసా.?
End of Article