కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఒక యువకుడ్ని కొట్టి, చంపిన సంఘటన హైదరాబాద్ శివారులో అన్నోజిగూడలో చోటుచేసుకుంది. అమ్మాయి  కుటుంబం ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హింసించడంతో తీవ్రంగా గాయపడి, ప్రాణాలు కోల్పోయాడు.

Video Advertisement

పోచారం మునిసిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో బుధవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాత్రి 8.30 నుండి 11.30 వరకూ ఆ యువకుడ్ని ప్రేమించిన అమ్మాయి కుటుంబం, చిత్ర-హిం-స-ల-కు గురిచేశారని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సమయం తెలుగు న్యూస్ కథనం ప్రకారం,  గజ్వేల్‌కు చెందిన ధరావత్‌ సుశీల కొడుకు కరణ్‌ (18)తో  పదిహేను సంవత్సరాలుగా అన్నోజిగూడలో నివాసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కరణ్‌ ని చదవిస్తోంది. వారింటికి దగ్గరలో ఉండే  15 ఏళ్ల బాలికతో కరణ్‌కు  పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. బుధవారం నాడు రాత్రి బాలిక పేరెంట్స్ పని మీద బయటకు వెళ్లడంతో కరణ్‌ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలికతో కరణ్ ఏకాంతంగా ఉన్నట్లు గమనించిన చుట్టుప్రక్కల వారు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పారు.
విషయం తెలియగానే ఇంటికి వచ్చిన బాలిక కుటుంబసభ్యులు రూమ్ బయట వైపు తాళం వేశారు. ఆ తరువాత  కొందర్ని పిలిచి ఆ యువకుడి  పై దాడి చేశారు. దారుణంగా కొట్టి, దాదాపు 3 గంటల పాటు అతన్ని చిత్ర-హిం-స-ల-కు గురి చేసి, కుమార్తెకు జోలికి మళ్ళీ రావద్దని వార్నింగ్ ఇచ్చి, విడిచిపెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు  తన ఇంటికి వెళ్ళి, కిందపడి అపస్మారక స్థితికి వెళ్లాడు.
కరణ్ కుటుంబసభ్యులు అతన్ని వెంటనే ఘట్‌కేసర్‌ గవర్నమెంట్ హాస్పటల్ కి  తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు మరణించినట్టుగా ధ్రువీకరించారు. కరణ్‌ తల్లి సుశీల కంప్లైంట్ చేయడంతో, ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, కరణ్  పై దాడి చేసిన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Also Read: ఛీ… తాతయ్య లాంటి వాడు..! కానీ అందరి ముందు..?