శ్రీలంక వేదికగా సారీ కొలంబో వేదికగా ఆదివారం అర్థరాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌ లో 38 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ రోజు (మంగళవారం) జరగాల్సిన రెండవ టీ 20 మ్యాచ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. భారత్ ఆల్ రౌండర్ “క్రునాల్ పాండ్య” కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో ఈ మ్యాచ్ వాయిదా పడింది.

ఈ రోజు ఉదయం జరిపిన కరోనా పరీక్షల్లో క్రునాల్ పాండ్యకి పాజిటివ్ అని తెలిసింది. అతనికి క్లోజ్ కాంటాక్ట్ లో ఎనిమిది మంది ఉన్నట్టు తెలిసింది. అందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. రేపటికి మ్యాచ్ వాయిదా వేసినట్టు ప్రకటించారు.