చైనా యాప్స్, ఫోన్స్ బ్యాన్ చేసారు..మరి ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

చైనా యాప్స్, ఫోన్స్ బ్యాన్ చేసారు..మరి ఇండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

by Mohana Priya

Ads

భారత్-చైనా మధ్య గొడవలు ఆగడం లేదు. ఇటీవల చైనా కి భారత్ కి జరిగిన యుద్ధంలో భారత దేశ సైనికులు అమరులైన విషయం మీకు తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన భారత్ చైనా పై చర్య తీసుకుంటూ మొదట చైనా నుండి ఉత్పత్తి అయిన మొబైల్ ఫోన్లను, అలాగే చైనా వాళ్లు డెవలప్ చేసిన యాప్ లను ఆపేసారు.

Video Advertisement

చైనా పై అధికంగా దెబ్బ కొట్టడానికి భారత్ అన్ని రకాలుగా చర్యలను తీసుకుంటోంది. దాంతో చైనా దేశస్తులు అయిన కొంతమంది నెటిజన్లు ఇండియన్ స్టూడెంట్స్  గో బ్యాక్ అనే నినాదాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

దాంతో భారతదేశంలో ఉన్నత విద్య పై చైనా – భారత్ గొడవల ప్రభావం పడకుండా భద్రతా సంస్థలు హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. విశ్వవిద్యాలయాల విషయంలో 54 ఒప్పందాలను సమీక్షించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది.

representative image

చైనా, భారతదేశంలో ఉన్న కొన్ని విశ్వవిద్యాలయాలతో పార్ట్నర్ షిప్ లో ఉంది. వాటిని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. అందులో భారతదేశంలో ఉన్న ఐఐటి, జె ఎన్ యు, బి హెచ్ యు, ఎన్ఐటిఎస్ ఉన్నాయి. అంటే ఈ విద్యా సంస్థల్లో చైనీస్ భాషను కూడా ఉపయోగిస్తారు.

కాబట్టి ఈ గొడవల వల్ల విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి మార్పు రాకూడదు అని చైనా ఎంబసీ భారత దేశానికి ఒక స్టేట్మెంట్ పంపించింది. దాంతో భారతదేశ ప్రభుత్వం కూడా చైనాకు చెందిన విశ్వవిద్యాలయాలతో భారతదేశ విశ్వవిద్యాలయాలు కుదుర్చుకున్న ఒప్పందం లో ఉన్న 54 మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) ని తిరిగి పరిశీలించబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల జారీ చేసింది.


End of Article

You may also like