Home Filmy Adda “పాడుతా తీయగా” నుండి “ఇండియన్ ఐడల్” వరకు… “వాగ్దేవి”లో ఈ ఇంప్రూమెంట్ చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

“పాడుతా తీయగా” నుండి “ఇండియన్ ఐడల్” వరకు… “వాగ్దేవి”లో ఈ ఇంప్రూమెంట్ చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Mohana Priya

టీవీలో సింగింగ్ కాంపిటీషన్స్ కి కొదవ లేదు. ప్రతి ఛానల్ లో దాదాపు ఏదో ఒక సింగింగ్ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది. ఇందులో చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు జడ్జెస్ గా ఉంటారు. ఈ కాంపిటీషన్ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు కూడా సరిగమప, పాడుతా తీయగాలాంటి సింగ్ కాంపిటీషన్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే ఇవన్నీ మాత్రమే కాకుండా ఆహాలో ఇండియన్ ఐడల్ కూడా వస్తోంది. ఈ ప్రోగ్రాం ఇటీవల మొదలయ్యింది. దీనికి శ్రీ రామచంద్ర యాంకర్ గా వ్యవహరించారు. తమన్, నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జెస్ గా వ్యవహరించారు.

vagdevi alaipongera performance in indian idol telugu

ఈ ప్రోగ్రాంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది సింగర్స్ నుండి కొంత మందిని సెలెక్ట్ చేశారు. ఈ ప్రోగ్రాం శుక్రవారం, శనివారం టెలికాస్ట్ అవుతుంది. ఇటీవల ఈ ప్రోగ్రాం ఫైనల్ జరిగింది. ఫైనల్స్ కి మెగాస్టార్ చిరంజీవి, విరాట పర్వం ప్రమోషన్స్ కోసం రానా దగ్గుబాటి, సాయి పల్లవి గెస్ట్స్ గా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి విన్నర్ అయిన వాళ్ళకి ట్రోఫీ ఇచ్చారు.

netizens trolling thaman for indian idol telugu judgement

ఇందులో వాగ్దేవి విజేతగా నిలిచారు. వాగ్దేవికి ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. వాగ్దేవి చిన్నప్పటి నుంచీ ఎన్నో కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. పాడుతా తీయగా ప్రోగ్రాంలో కూడా వాగ్దేవి పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన అందరూ కూడా వాగ్దేవి చాలా ఇంప్రూవ్ అయ్యారు అని పొగుడుతున్నారు.

indian idol winner vagdevi paduta teeyaga performance video goes viral

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వాగ్దేవిని చాలా మెచ్చుకున్నారు. అంతే కాకుండా గీత ఆర్ట్స్ లో వచ్చే సినిమాలో వాగ్దేవికి పాడడానికి అవకాశమిచ్చారు. సింగర్ కార్తీక్ కూడా తన నెక్స్ట్ సినిమా లో వాగ్దేవితో పాట పాడించుకుంటాను అని చెప్పారు. వీళ్లు మాత్రమే కాకుండా ఇండియన్ ఐడల్ ప్రోగ్రాంకి చాలా మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహించి అందులో కొంత మందిని ప్రోగ్రాంలో తీసుకున్నారు. ఈ ప్రోగ్రాం ఆహాలో టెలికాస్ట్ అయ్యింది. ప్రోగ్రాం కూడా చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

watch video :

https://www.youtube.com/watch?v=12qjZIe1Fek

You may also like