ఒక పక్క కరోనా…ఇప్పుడు అమెరికాలో ఉండే ఇండియన్స్ కి మరో కొత్త టెన్షన్.! H-1B వీసాలు కలిగి ఉన్నా?

ఒక పక్క కరోనా…ఇప్పుడు అమెరికాలో ఉండే ఇండియన్స్ కి మరో కొత్త టెన్షన్.! H-1B వీసాలు కలిగి ఉన్నా?

by Megha Varna

Ads

కరోనా వైరస్ (covid 19 ) ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పడుతుంది. దీనికి అమెరికా ఏమి మినహాయింపు కాదు .కరోనా ఎఫెక్ట్ అమెరికా వ్యాపారాలపై చాలా ఎక్కువగా పడి నష్టపోయాయి అయితే ఈ కారణంగా వివిధ రంగాలలో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉంటుంది అని ఎకనామికల్ ఎక్సపర్ట్స్ చెప్తున్నారు. అయితే ఈ సమయంలో H 1 B వీసాలు వున్నా ఫారిన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

అమెరికా సంస్థలు భారత్ చైనా నుండి ప్రతి సవంత్సరం కొన్ని వేలమంది టెక్నాలజీ ఎక్సపర్ట్స్ ని ఉద్యోగాలలోకి తీసుకుంటుందన్న విషయం తెలిసిందే . అమెరికాలోH 1 B  వీసాతో ఉద్యోగం చేస్తున్న వారిలో సగం మందికి పైగా భారత్ చైనా వారే .అనుకోని విదంగా అకస్మాత్తుగా వచ్చిన ఈ కరోనా వైరస్ కారణంగా రాబోయే రోజులలో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందన్న ఎక్సపర్ట్ ఎనాలిసిస్ పై H 1 B  విసదారులు భయాందోళనలకు గురి అవుతున్నారు.

అమెరికాలో పనిచేసుకునేందుకు ప్రొఫెషనల్ ఎక్సపర్ట్స్ కి ఇచ్చే65  వేల H 1 B  వీసాల లిమిట్ అయిపోయింది అని యూ ఎస్ సిటీజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సోమవారం వెల్లడించింది.  అప్లికేషన్స్ సమర్పించడానికి జూన్ 30  చివరి తేదీ అని ,ఎంపికైన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది .

ఇప్పుడు కరోనా వైరస్ వలన అన్ని దేశాలు ఎంట్రీ నిషేదించిన విషయం తెలిసిందే .అయితే అమెరికాలో H 1 B వీసాలతో వున్నవాళ్లు తమదేశాలకు చేరుకోవడం ఇప్పుడు కుదరదు దీంతో తమ 60  రోజుల లిమిట్ ను  180  రోజులకు పొడిగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత నిబంధలను ప్రకారం H 1 B  వీసాదారులు 60 రోజులు మాత్రమే అమెరికాలో ఉండడానికి కుదురుతుంది .ఈ 60 రోజుల లోపే వేరే ఉద్యోగం వెతుక్కోవలిసి ఉంటుంది.  లేదంటే అమెరికా నుండి వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది కావున లిమిట్ ను 180  రోజులకు పెంచవల్సిందిగా ట్రంప్ గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నారు.

అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది .అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. మరణాల సంఖ్య కూడా తార స్థాయిలో పెరుగుతూ పోతుంది. అమెరికా ఈ కరోనా వైరస్ నుండి బయట పడేందుకు ఇంకా చాలాకాలం పట్టేటట్లుగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అమెరికాలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయినట్టు సమాచారం. ఒక నివేదిక ప్రకారం రానున్న రోజులలో7.2  కోట్ల మంది నిరుద్యోగులుగా మారే అవకాశం.

ఇప్పటికి H 1 B  వీసా మీద అమెరికాలో వున్నవాళ్లు నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హులు కాదు మరియు సామజిక భద్రతా ప్రయోజనాలకు కూడ అర్హులు కాదు.H 1 B  వీసా నుండి తొలగించిన వారిలో మేము మొదటి స్థానంలో ఉన్నామని ఇప్పటికే చాలా కంపెనీ లు ప్రకటించాయి.

ఈ పరిస్థితులలో తమ ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కూడ అమెరికాలో ఉండేందుకు తమ గడువును పొడిగించాల్సిందిగా డిమాండ్ చేస్తూH 1 B  వీసా దారులు ఇప్పటికే వైట్ హౌస్ వెబ్ సైట్ లో ఓ పిటిషన్ దాఖలు చేసారు .20000 మంది సంతకాలు సేకరించి తమ గడువును 60  నుండి 180 రోజులకు  పెంచాల్సిందిగా ట్రంప్ గవర్నమెంట్ ను అభ్యర్ధించారు .కానీ రిప్లై రావడానికి ఇంకా ఎనభై వేల పిటిషన్ లు అవసరం. ఆర్ధిక మాంధ్యం H1 B ఉద్యోగస్థులపై భారీ ప్రభావాన్ని చూపవచ్చని పిటిషన్ పేర్కొంది.

image source: 1 , 2 , 3 , 4 , 5 , 6


End of Article

You may also like