మే 3 తర్వాత స్వదేశానికి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు?

మే 3 తర్వాత స్వదేశానికి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు?

by Megha Varna

విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు ..అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఇతర దేశాలలో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడానికి వీలులేకుండా చిక్కుకుపోయారు ,,దీంతో ఎప్పుడు భారత్ కు చేరుతామా అని విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులు వెయ్య కళ్ళతో ఎదురుచూస్తున్నారు ..ఈ నేపథ్యంలో ఈనాడు కథనం ప్రకారం…. ఇలా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. వివరాలలోకి వెళ్తే ..

Video Advertisement

మే 3 తో లాక్ డౌన్ గడువు పూర్తి కాగానే వారిని భారత్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని   దీనితో సంబంధం ఉన్న అధికారులు వెల్లడించారు ..ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్త్వాలు నుండి వస్తున్న వత్తిడి కారణంగా కేంద్రం ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం ..దీనికి సంబంధించి అతి త్వరలోనే కేంద్రం ఓ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది ..

 

ఈ నేపథ్యంలో వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయుల డేటాను ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ప్రభుత్వం  ఆదేశించింది .వారిని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత వారికి పరీక్షలు నిర్వహించడం అవసరం అయితే క్వారంటైన్ లో ఉంచడం లాంటి విషయాలపై చర్చలు జరిగినట్టు సమాచారం .ఇప్పటికే ఈ విషయంపై ప్రధానిమంత్రి కార్యాలయం నుండి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రలతో చర్చలు జరిపారని సంబంధిత అధికారుల నుండి వస్తున్న సమాచారం .ఎలాంటి పరిస్థితులలో అయినా ఇక్కడి స్థానిక కరోనా బాధితులతో వారిని కలవకుండా ఉండేటట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం ..

వివిధ దేశాలకు సంబందించిన రాయబారులు మరియు కొంతమంది అధికారులతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్త్వం చర్చలు జరిపినట్లు సంబంధింత అధికారుల నుండి వస్తున్న సమాచారం .తరచుగా విదేశాలలో చిక్కుపోయిన భారతీయులు ఎలా ఉన్నారు ,అక్కడ వారి పరిస్థితి ఏంటి అని తదితర అంశాల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది అని ఓ అధికారి తెలిపారు.

source: eenadu


You may also like