ఆయన మొదటి పెళ్లి అప్పుడు చిన్నపిల్ల… ఇప్పుడు అదే వ్యక్తికి మూడవ భార్య..! వీరి ప్రేమ కథ ఏంటంటే..?

ఆయన మొదటి పెళ్లి అప్పుడు చిన్నపిల్ల… ఇప్పుడు అదే వ్యక్తికి మూడవ భార్య..! వీరి ప్రేమ కథ ఏంటంటే..?

by Harika

Ads

ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చల్లో నిలిచింది. సాధారణంగా సినిమాలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నిజ జీవితంలో ఇలాంటివి జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపానికి చెందిన రెనాటా ఫదేయా వయసు 24 సంవత్సరాలు. ఆమె తనకంటే 38 సంవత్సరాలు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఇలా వయసులో చాలా పెద్దవారైన వాళ్లని వివాహం చేసుకుంటున్నారు. ఇందులో వింత ఏం ఉంది అనుకోవద్దు.

Video Advertisement

indonesia wife and husband incident

ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మొదటి పెళ్లి సమయానికి రెనాటా ఫదేయా వయసు 9 సంవత్సరాలు. ఆయన 2009 లో మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళికి రెనాటా ఫదేయా అతిథిగా వెళ్లారు. అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల. రెనాటా ఫదేయా భర్త 2011 లో రెండవ భార్యతో విడిపోయారు. ఆయనకి రెండవ వివాహంలో పిల్లలు లేరు. మొదటి వివాహంలో ఒక బిడ్డ ఉంది. రెనాటా ఫదేయా తన భర్తని మళ్లీ 2019 లో కలిశారు. 2020 లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. టిక్ టాక్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, తన భర్తని తాను 2019 లో మాత్రమే కలిశాను అని అనుకున్నారు అని, కానీ ఇద్దరు బంధువులు అని, ఈ విషయం తనకి ఇటీవలే తెలిసింది అని, 15 సంవత్సరాల క్రితమే తన భర్తని కలిసినట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు.

అందులో భాగంగానే ఆమె మొదటి భర్త పెళ్లిలో ఆమె అతిథిగా వెళ్ళిన ఫోటోని, అలాగే ఇప్పుడు అదే భర్తతో, తన బాబుతో ఉన్న ఫోటోని రెనాటా ఫదేయా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయాని తన భర్త చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అంటే, ఇప్పుడు భార్య భర్తలు అయిన ఇద్దరు చిన్నప్పుడే తెలియకుండా కలవడం, ఆ సమయంలో ఫోటోలు తీసుకోవడం వంటివి సోషల్ మీడియాలో అంతకుముందు కూడా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయా కూడా తన భర్తని తాను చిన్నప్పుడే కలిసిన ఫోటోని షేర్ చేశారు.


End of Article

You may also like