పిల్లలతో భిక్షాటన చేయించి… 45 రోజుల్లో 2.5లక్షల రూపాయలు సంపాదించిన తల్లి..! చివరికి?

పిల్లలతో భిక్షాటన చేయించి… 45 రోజుల్లో 2.5లక్షల రూపాయలు సంపాదించిన తల్లి..! చివరికి?

by kavitha

Ads

భిక్షాటన చేస్తూ రోడ్ల పై తిరిగేవారిని చూస్తే ఎవరికైనా దయ కలుగుతుంది. అందులోనూ  చిన్న పిల్లలు రోడ్డుపై భిక్షటన చేస్తుంటే  చూసేవారి కడుపు తరుక్కుపోతుంది. ఆ పిల్లల పరిస్థితి చూడలేక అటువైపుగా వెళ్ళే ప్రయాణికులు తోచినంత వారి చేతిలో పెడుతుంటారు.

Video Advertisement

అయితే ఇలాంటి స్థితిని ఆసరాగా చేసుకుని ఒక స్త్రీ తను కన్న పిల్లలతోనే బలవంతంగా భిక్షాటన చేయించి, లక్షల్లో ఆర్జించడం  ప్రారంభించింది. ఆ విధంగా  45 రోజుల్లో 2.5 లక్షల రూపాయలను సంపాదించింది. ఈ షాకింగ్ ఘటన ఇండోర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్‌కు చెందిన ఇంద్రాబాయికి ఐదుగురు పిల్లలు. వీరిలో ముగ్గురిని ఆమె యాచన వృత్తిలోకి దింపింది.  ఆమె  తన పిల్లలను బలవంతంగా యాచక వృత్తిలోకి దింపినందుకు అరెస్టు చేయబడింది. ఆమె కేవలం 45 రోజులలో ఆశ్చర్యకరంగా రూ. 2.5 లక్షలు సంపాదించింది. పోలీసులు ఇందిరను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె భర్త పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇంద్రాబాయి వ్యూహాత్మకంగా తన పిల్లలో పెద్ద వారిని లువ్-కుష్ స్క్వేర్ వద్ద , మహాకాల్ దేవాలయం ఉన్న ఉజ్జయినికి వెళ్లే దారిలో భిక్షాటనకు పెట్టింది. ఉజ్జయినీకి వెళ్లే ప్రయాణికులు పిల్లలుకు తమకు తోచినంత ఇస్తుండేవారు.  అక్కడికి పెద్ద ఎత్తున జనాలు వస్తుండడంతో ఆమె ఆదాయం పెరుగుతూ వెళ్ళింది.  ప్రత్యేకించి మహాకాల్ లోక్ నిర్మాణం తర్వాత, రోజుకు 1.75 లక్షలకు చేరుకుంది. యాచక రహిత నగరంగా మార్చేందుకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్న  ప్రవేశ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆ స్త్రీ  బండారాన్ని బయట పెట్టింది.

సంస్థ ప్రెసిడెంట్ రూపాలీ జైన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  ఇండోర్‌-ఉజ్జయిని రోడ్ లువ్-కుశ్‌ కూడలిలో తన 8 ఏళ్ళ కుమార్తె, ఇద్దరు కొడుకులతో కలిసి భిక్షాటన చేస్తుండగా అరెస్ట్‌ చేశారు. ఆమె భర్త పిలల్లను భిక్షాటనకు దింపివెళతారని, 45 రోజుల్లో పిల్లల ద్వారా సంపాదించిన 2.5 లక్ష రూపాయాల్లో  లక్షను తన  అత్తామామలకు పంపినట్టు, 50 వేల రూపాయలు బ్యాంకులో జమ చేసినట్టు, 50 వేల రూపాయలు తన బిడ్డ పేరు పైన డిపాజిట్‌ చేసనట్టు దర్యాప్తులో వెల్లడించింది.

Also Read: ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొనడమే.. కానీ రైలు ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

 


End of Article

You may also like