సౌండ్ ఒకేలాగా ఉంటే కాపీ అనేస్తారు.!

సౌండ్ ఒకేలాగా ఉంటే కాపీ అనేస్తారు.!

by Mohana Priya

Ads

ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన వి సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంత మంది బాగుంది అంటున్నారు. ఇంకొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా నుంచి ఎక్కువ ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయొద్దని, ఇది స్ట్రైట్ సినిమా అని అర్థం వచ్చేలా చెప్పారు నాని.

Video Advertisement

nani v cinema watch online free

సినిమా స్టోరీ వల్ల డిసప్పాయింట్ అయిన వాళ్లు కొంతమంది అయితే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కూడా ఎక్కడో ఆల్రెడీ విన్నట్టు ఉండడంతో డిసప్పాయింట్ అయిన వాళ్లు కొంతమంది ఉన్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాట్ససన్ (తెలుగులో రాక్షసుడు), ఇంకా ఇంగ్లీష్ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ కొట్టినట్టు ఉంది అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ సినిమాకి సంగీతం అమిత్ త్రివేది అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎస్.ఎస్.తమన్ అందించారు.

అయితే ఈ విషయంపై ఇటీవలే ఈ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ ” ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. చాలామంది రాట్ససన్ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కాపీ కొట్టాం అని అన్నారు. రెండు సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే లాగా అనిపించి ఉండవచ్చు కానీ కాపీ కొట్టలేదు. అంటే రెండు సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడానికి ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఉండొచ్చు. అందుకే రెండు సిమిలర్ గా అనిపిస్తాయి. వన్ నేనొక్కడినే సినిమా ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ లో కొన్ని ఫ్రేసెస్ , ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఒకే లాగా ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన కాపీ కొట్టడం కాదు.

ఈ ఒక్క సినిమాకే కాదు ఇంతకు ముందు కూడా చాలా సినిమాలకి ఇలానే మ్యూజిక్ కాపీ కొట్టి నట్టు ఉంది అనే మాట విన్నాను. కానీ నిజంగా చూస్తే అక్కడ కాపీ కొట్టలేదు. సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఉంటారు. మన తెలుగు వాళ్ళకి తమిళ్ వాళ్ళకి ఉన్నంత సంగీత పరిజ్ఞానం లేదు. మ్యూజిక్ క్రాఫ్ట్ పై అంత అవగాహన లేదు. అందుకే ఏదైనా సిమిలర్ గా అనిపించగానే కాపీ అనేస్తారు.

ఇంకొక విషయం ఏంటంటే తమన్ చాలా టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు. అతను వేరే సినిమాల మ్యూజిక్ అందులోనూ తమిళ్ లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా మ్యూజిక్ అసలు కాపీ కొట్టరు. ఎందుకంటే తమన్ కి తెలుసు. సోషల్ మీడియా వల్ల ఇలాంటివి ఐడెంటిఫై చేయడం కొన్ని నిమిషాల పని అయిపోయింది. కాపీ కొట్టకపోతేనే ఇంత గొడవ అవుతోంది, ఒకవేళ నిజంగానే కాపీ కొడితే ఎలా ఉంటుందో ఊహించండి. నేను చెప్పేది ఏంటంటే రెండు సిమిలర్ గా ఉన్నాయి కానీ కాపీ కాదు.” అని అన్నారు.

 

 


End of Article

You may also like