Ads
ఒక టైం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో పేరు తెచ్చుకున్న నటులలో ఒకరు ఇంద్రజ. ఇంద్రజ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. కొన్ని సంవత్సరాల వరకు సినిమాలకి దూరంగా ఉన్న ఇంద్రజ, కొంతకాలం క్రితం విడుదలైన అజ్ఞాతవాసి లో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇంద్రజ గత కొంతకాలంగా టెలివిజన్ లో కూడా కనిపిస్తున్నారు.
Video Advertisement
ఒక టైం వరకు రోజా అందుబాటులో లేనప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో జడ్జిగా వచ్చారు ఇంద్రజ. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా కనిపిస్తున్నారు. మళ్లీ ఇంద్రజ సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్ లో ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంద్రజ ఇండస్ట్రీలో ఉన్నా కానీ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఇంద్రజ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వస్తున్నారు. ఇంద్రజ తో పాటు సుడిగాలి సుధీర్ కూడా ఆ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాం లో ఓంకార్ ఇంద్రజ తండ్రి ఫోటో ని చూపించారు. అప్పుడు ఇంద్రజ తన తండ్రి గురించి మాట్లాడారు. ఇంద్రజ మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వంట తన తండ్రి చేసేవారు అని, తన తల్లికి మందులు అందించడం నుండి అన్ని పనులు తన తండ్రి చూసుకునేవారు” అని ఎమోషనల్ అయ్యారు.
తనకి తల్లి, తండ్రి ఇద్దరూ కలిపి నాన్నే అయ్యారు అని, తనకి తన తండ్రి అంటే చాలా ఇష్టం అని అన్నారు. అంతే కాకుండా “మామూలుగా తండ్రి ప్రేమని మనం ఎక్కువగా గుర్తించము అని, కానీ వాళ్లే లేకపోతే కుటుంబం అనే ఒక బంధమే లేదు అని, తండ్రులందరికీ తాను తలవంచి నమస్కారాలు చేస్తున్నాను” అని అన్నారు.
watch video :
End of Article