ఫోన్ లో మనం రోజు వినే గొంతు ఆమెదే.!

ఫోన్ లో మనం రోజు వినే గొంతు ఆమెదే.!

by Mohana Priya

Ads

ఈ మధ్య మనం ఎవరికి ఫోన్ చేసినా covid 19 కాలర్ ట్యూన్ వినిపిస్తోంది. ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మంచి పథకం అని బానే అనిపించినా తర్వాత ప్రతిసారి వినడం జనాలకి కూడా సహనానికి పరీక్ష లాగా అనిపిస్తుంది.అందుకే ప్రభుత్వం వాళ్ళు 1 నొక్కి ఆ కాలర్ ట్యూన్ ఆపేసే సదుపాయాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రతి తెలుగు వారి ఫోన్లో మోగుతున్న ఈ గొంతు ఎవరిదో మీకు తెలుసా. ఆవిడ పేరు దుగ్గిరాల పద్మావతి.

Video Advertisement

పద్మావతి ఒక ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్. విశాఖపట్నం కి చెందిన పద్మావతి తన గాత్రంతో దాదాపు నాలుగు నెలల నుండి రెండు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు అయ్యారు.సోషియాలజీ లో MA చదివిన పద్మావతి ఇప్పుడు ఢిల్లీలో స్థిరపడ్డారు అక్కడే ఒక ప్రైవేట్ సంస్థ లో పని చేస్తున్నారు. తన వృత్తి ఇది కాకపోయినా డబ్బింగ్ మీద ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపు వచ్చారు.

తన ఆసక్తికి సామాజిక అవగాహన కూడా జోడిస్తూ ప్రభుత్వం తమ పథకాలతో రూపొందించిన ఎన్నో రేడియో కార్యక్రమాలకి తన గాత్రాన్ని అరువు ఇచ్చారు.ఇలా రేడియో ప్రియులకి కూడా ఆమె ఎప్పుడో పరిచయం అయ్యారు. పదేళ్లుగా ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఇంకా ఎన్నో ప్రభుత్వ పథకాల గురించి తన గాత్రం ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తూ తన వంతు సామాజిక సేవను చేస్తున్నారు పద్మావతి.


End of Article

You may also like