Ads
మామూలుగా అందరూ ఇన్సూరెన్స్ లు తమ ఆస్తుల పైనో లేక ఆరోగ్యాల కోసం శరీరం పైన చేయించుకుంటారు.కాని ఈ మధ్య సెలబ్రెటీలు పళ్ళ పైన నవ్వు పైన అంటూ రకరకాల ఇన్సూరెన్స్ లు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
Video Advertisement
2009 లో జెన్నరో పెల్లికియా అనే వ్యక్తి తన నాలుక పై ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు.దానికి అతడు పని చేస్తున్న కంపెనీ సుమారు 92 కోట్లు విలువ కట్టింది.అసలు ఎందుకు ఇతడు తన నాలిక పై ఇన్సూరెన్స్ చేయించుకున్నాడో తెలుసా?అసలు కథ ఏంటంటే జెన్నరో పెల్లికియా
మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక కోస్టా కాఫీ కంపెనీలో చేరాడు. అక్కడ 18 ఏళ్లు పని చేసిన తర్వాత లండన్‌లోని లాంబెర్త్ రోస్టరీలో చీఫ్ కాఫీ టేస్టర్ గా జాయిన్ అయ్యాడు.
మన జెన్నరో పెల్లికియా కాఫీ గింజలను రుచి చూశాకే అవి సర్వింగ్ కు వెళ్తుంటాయి.అక్కడ తయారయ్యే కోస్టా కాఫీ తాగడం కోసం
ప్రపంచంలో హై క్లాస్ సెలబ్రెటీ లందరూ అక్కడికి వస్తుంటారు.ఇక్కడి నుండి యూకే మరియు తదితర దేశాలకు 118 మిలియన్ కప్పుల కోస్టా కాఫీ సరఫరా అవుతుంది.అందుకే మనోడి నాలుకకు అంత డిమాండ్.
End of Article