ఇంటర్ స్టూడెంట్స్ ఇది తప్పక చదవండి..! పరీక్ష తర్వాత ఆ తప్పు అస్సలు చేయకండి..!

ఇంటర్ స్టూడెంట్స్ ఇది తప్పక చదవండి..! పరీక్ష తర్వాత ఆ తప్పు అస్సలు చేయకండి..!

by Sainath Gopi

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చ్ 4 న మొదటి సంవత్సరం వారికి, మార్చ్ 5 న రెండో సంవత్సరం వారికీ పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరుగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షరాయనున్నారు. అటు ఏపీలో 10.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఈ నెల 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఇది ఇలా ఉండగా…ఇంటర్ పరీక్షల ఫలితాల విషయంలో కిందటి సంవత్సరం ఎంతటి గందరగోళం జరిగిందో అందరికి తెలిసిందే. 90 శాతం మార్కులు వచ్చిన వారికి కూడా ఫెయిల్ అని వచ్చింది. అది ఫేక్ అని తెలియక ఎంతో మంది విద్యార్థులు మనస్తాపానికి గురయ్యారు. తల్లితండ్రులు పిల్లలపై కోప్పడ్డారు. కొంతమంది విద్యార్థులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది అయితే పరీక్ష రాయగానే ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాలు రాకముందే మీరే ఊహించుకొని భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. అది అమాయకత్వమో లేక మూర్ఖత్వమో?

ఫలితాలు వచ్చాక ఫెయిల్ అయ్యారే అనుకోండి. ఏం నష్టం జరుగుతుంది అని? ఈ మాత్రం దానికి జీవితం అంతం చేసుకోవడం ఎందుకు? పిల్ల జమిందార్ సినిమాలో చెప్పినట్టు పాస్ అయితే ప్రపంచానికి నువ్వు తెలుస్తావు.. ఫెయిల్ అయితే నీకు ప్రపంచం అంటే ఏంటో తెలుసుతుంది? అందరికి చదువులో టాప్ రావడం సాధ్యం కాదు. ఫెయిల్ అయినంత మాత్రానా ఆత్మహత్య చేసుకోకండి. మరోసారి ప్రయత్నించండి పాస్ అవ్వడానికి. మీకు ఇష్టమైన కెరీర్ ఏంటో మీరే గుర్తించండి. దానివైపు మీ అడుగులు వేయండి. సక్సెస్ అంటే ఇంటర్ పాస్ అవ్వడం ఒక్కటే కాదు. బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి. దయచేసి మీ కన్న వాళ్ళ గురించి ఆలోచించండి. మీ మీద ఆశలు పెట్టుకున్న వారి ఆశలను ఆత్మహత్య చేసుకొని ఆశలను ఆవిరి చేయకండి.

ఈ క్రమంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు, ప్రతీ జూనియర్ కళాశాలలో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డు కాలేజీలను ఆదేశించింది. ఈ ఏడాది టెక్నికల్ గా ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ముందుగానే సాఫ్ట్‌వేర్‌ను అన్ని విధాల పరీక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవ్వకుండా ఏకాగ్రతతో చదివి ఉత్తీర్ణులు కావాలనేది అందరి ఆశ.

You may also like