సోనూసూద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…..సోనూ సూద్ తెలుగు ఇంటి అల్లుడు

సోనూసూద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…..సోనూ సూద్ తెలుగు ఇంటి అల్లుడు

by Mohana Priya

Ads

ప్రస్తుతం ఎక్కువ చర్చలో ఉన్న సెలబ్రిటీ సోనూసూద్. లాక్ డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన చాలామందిని సోనూసూద్ వాహనాలు ఏర్పాటు చేసి తమ స్వస్థలాలకు పంపించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసిన వెంటనే స్పందించి తన వంతు సహాయం చేస్తున్నారు. సోనూసూద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

పంజాబ్ కి చెందిన సోనుసూద్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు తన స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ముంబైకి వెళ్లి మోడల్ గా ఎన్నో షోలు చేశారు. అంతేకాకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మోడలింగ్ చేస్తూనే సౌత్ ముంబై లో ఉద్యోగం చేసేవారు. తర్వాత గ్రేవియెరా మిస్టర్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల లో ఒకరిగా నిలిచారు సోనూసూద్.

1999 లో విజయ్ కాంత్ నటించిన కల్లాళగర్ అనే తమిళ చిత్రంతో తన నటన కెరీర్ ని మొదలు పెట్టారు సోనుసూద్. తర్వాత హ్యాండ్స్ అప్ అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. అమ్మాయిలు అబ్బాయిలు, చంద్రముఖి సినిమాలతో తెలుగు వారికి సుపరిచితులయ్యారు. కానీ తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చింది మాత్రం సూపర్, అతడు సినిమాలు.

ఆ తర్వాత వచ్చిన అరుంధతి సినిమా సోనుసూద్ కెరీర్లోనే ఒక మైలురాయి గా నిలిచింది. ఆ పాత్రలో సోనూసూద్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. తర్వాత దూకుడు, కందిరీగ, జులాయి, ఆగడు లాంటి ఎన్నో తెలుగు చిత్రాలతో పాటు దబంగ్, హ్యాపీ న్యూ ఇయర్, సింబా వంటి ఎన్నో హిట్ హిందీ చిత్రాల్లో, అంతేకాకుండా కన్నడ లో వచ్చిన కురుక్షేత్ర లో అర్జున పాత్ర పోషించారు. ఇంకా కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

చదువుకునే సమయంలో సోనాలి తో పరిచయం అయింది. ముందు ఇద్దరు స్నేహితులు అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది. సోనాలి మన తెలుగు అమ్మాయే. తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. వాళ్లకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తను  సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సోనాలి తనని ఎంతో ప్రోత్సహించారు అని  సోను సూద్ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పారు.

ఇప్పుడున్న కష్ట పరిస్థితులలో ఎంతోమందికి సహాయం చేసి నిజజీవితంలో హీరో అయ్యారు సోనుసూద్. చాలామంది ఇదంతా రాజకీయాల్లోకి వెళ్ళటానికి ప్రణాళిక ఏమో అని సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఇదంతా రాజకీయాల కోసమేనా అని అడిగారు.

దానికి సోనూసూద్ తనకి గత పది సంవత్సరాల నుండి రాజకీయాల్లోకి రావడానికి ఎన్నోసార్లు ఎంతోమంది ఆహ్వానించారు అని, కానీ ఇదంతా ఎటువంటి ప్రణాళికతోనూ చేసేది కాదు, తను చేస్తున్న దానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు అని,  సాటి మనుషులకు సహాయం చేయడంలో ఒక తృప్తి ఉంటుంది అని, అందుకే తన వంతు సహాయం చేస్తున్నాను అని జవాబిచ్చారు.


End of Article

You may also like