పవన్ “బద్రి” వెనక ఇంత కథ ఉందా? పూరి అసలు హీరోగా ఎవరిని అనుకున్నారంటే?

పవన్ “బద్రి” వెనక ఇంత కథ ఉందా? పూరి అసలు హీరోగా ఎవరిని అనుకున్నారంటే?

by Mounika Singaluri

Ads

‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్’ ఈ డైలాగ్ మనకు పరిచయమయ్యి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పూరి మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ గా స్టార్ డమ్ అందుకుంది మాత్రం బద్రి చిత్రంతోనే.పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం బద్రి.పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ ప్రేక్షకులకు అత్యంత దగ్గర అయింది కూడా ఈ చిత్రంతోనే.ఏప్రిల్ 20 2000  సంవత్సరంలో బద్రి చిత్రం ‘విజయలక్ష్మి మూవీస్ బ్యానర్’ పై టి త్రివిక్రమ్ రావు నిర్మాణంలో విడుదల అయ్యింది.

Video Advertisement

పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ , పూరి డైలాగ్స్ ,రమణ గోగుల బాణీలు ఈ చిత్రానికి మేజర్ హైలైట్స్ అని చెప్పాలి .అయితే ఈ చిత్రం వెనుక మనకు తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి.ఈ చిత్రంతోనే పవన్ – రేణు దేశాయ్ లకు మధ్య పరిచయం ఏర్పడి ,ప్రేమగా మారి అది కాస్తా పెళ్లి వరకు వెళ్లడం జరిగింది ..

అంతే కాదు.. ఈ చిత్రంలో పూరి మొదట అనుకున్న హీరో పవన్ కాదు. అవును మీరు విన్నది నిజమే… ‘బద్రి’ స్క్రిప్ట్ ను మొదట పవన్ కోసం పూరి రాసుకోలేదట . రాంగోపాల్ వర్మ దగ్గర 18 వ శిష్యుడు గా పూరి జగన్నాథ్ పనిచేసేవాడు. పూరి ఆ టైములో రాంగోపాల్ వర్మ కి అత్యంత సన్నిహితుడు అయిన నాగార్జున తో పూరీకి కూడా మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో పూరి మొదట నాగార్జున ని దృష్టిలో పెట్టుకునే ‘బద్రి’ కథని రాసాడు.

కానీ ఆ సమయంలో నాగార్జున ఇతర చిత్రాలతో చాలా బిజీగా ఉండడంతో …. వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అందులోనూ అప్పటికే కరుణాకరన్, అరుణ్ ప్రసాద్ వంటి ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుని పవన్ వద్దకు వెళ్లి నేను మొదటి సన్నివేశం నుండి క్లైమాక్స్ వరకు చెప్తాను నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి అని పవన్ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోని బద్రి స్క్రిప్ట్ మొత్తం చెప్పాడు .

తరువాత పవన్ చెప్పిన కొన్ని మార్పులు చేయగా… క్లయిమాక్స్ మాత్రం చేంజ్ చెయ్యను అని ముక్కు సూటిగా పూరి పవన్ కు చెప్పడం.పూరి ఆటిట్యూడ్ కూడా పవన్ కు నచ్చడంతో ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అలా ఆ కథ పూరి నాగార్జున కోసం అనుకుంటే పవన్ వద్దకు వెళ్ళి టాలీవుడ్ లో  ఒక ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచింది .

 


End of Article

You may also like