విజయం దిశగా కరోనాపై ఆంధ్రప్రదేశ్ పోరాటం…ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సిన 10 విషయాలు ఇవే.!

విజయం దిశగా కరోనాపై ఆంధ్రప్రదేశ్ పోరాటం…ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకోవాల్సిన 10 విషయాలు ఇవే.!

by Mohana Priya

Ads

ఇటీవల కరోనా కి మెడిసిన్ సృష్టించి కేరళ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా తన శైలిలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది.అవేంటంటే

Video Advertisement

దేశంలో అత్యధిక  కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఇప్పటికీ ఏపీ అగ్రస్థానం

ఆంధ్రప్రదేశ్ లో 53.4 మిలియన్ల జనాభా ఉంటే అందులో ఒక మిలియన్ కు 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తమిళనాడు తర్వాత ఎక్కువ మొత్తంలో వైద్య పరీక్షలు నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.      తమిళ్ నాడు లో 77 మిలియన్ల జనాభా ఉంటే అందులో ఒక మిలియన్ కు 12,264 మందికి వైద్య పరీక్షలు చేశారు.

 

వాలంటీర్ సిస్టం

అసలు పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు వాలంటీర్లు. కరోనా భారతదేశంలోకి వచ్చింది అని తెలిసిన వెంటనే 4.5 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వారు రాష్ట్రం అంతటా 11000 గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు.ఒక్క వాలంటీర్ యాభై ఇళ్లలో వైద్య పరీక్షలు చేశారు. మొదటి దశ పరీక్షల్లో వాలంటీర్ల సహాయంతో పదివేలకు పైగా ఫారెన్ నుండి వచ్చిన వాళ్ల వివరాలు నమోదయ్యాయి.

అతి తక్కువ పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. 1.38 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో 8 శాతం పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 15 శాతం కేసులు నమోదు అయ్యాయి.

ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ల్యాబ్ లు

ఆంధ్రప్రదేశ్ లో టెస్ట్ లు చేయడానికి మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఎక్కువ సంఖ్యలో ల్యాబ్ లు ఉన్నాయి. మార్చ్ లో ఉన్న ల్యాబ్ ల సంఖ్య 0. ఇప్పుడు ఉన్న ల్యాబ్ ల సంఖ్య 64.ఇప్పుడు అదనంగా 35 ట్రూనాట్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.ఇలా ఏర్పాటు చేసిన ల్యాబ్ లో రోజుకి ఎన్నో వేల మందికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.

ఇటీవలే రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 36 వేలకు పైగా కరోనా పరీక్షలు చేశారు.అసలు ల్యాబ్ ఏ లేని పరిస్థితి నుండి రోజుకి దాదాపు 30 వేల మందికి పైగా పరీక్షించే స్థాయికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఘనత ఖచ్చితంగా ప్రశంసించాల్సిన విషయమే.

 

మొబైల్ టవర్ల సహాయంతో కరోనా ను కనుగొన్న మొదటి రాష్ట్రం

మొబైల్ టవర్ల ని ఇలా కూడా వాడొచ్చు అని నిరూపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్ర అనే యాప్ ద్వారా మొబైల్ సిగ్నల్ ని బట్టి క్వారంటైన్ లో ఉన్నది ఎవరో గుర్తించి వాళ్ళకి వంద మీటర్ల దూరంలో లేదా వంద మీటర్ల లోపు తమ గ్రామంలో ఉన్న కరోనా కేంద్రానికి, ఇంకా రాష్ట్రంలో ఉన్న కరోనా కేంద్రానికి సమాచారం అందించారు. ఇలా ఆలోచించడం బహుశా దేశ ప్రభుత్వం వల్ల కూడా కాలేదేమో.

పేషంట్ వెళ్ళిన ప్రదేశాలని కనిపెట్టడం కోసం ప్రత్యేక పరికరం ఏర్పాటు

మొబైల్ టవర్ సిగ్నల్ సహాయంతో కరోనా పేషెంట్లని కనిపెట్టడమే ఒక ఎత్తు అనుకుంటే ఇది మరొక ఎత్తు. పేషంట్ తనకి పాజిటివ్ అని తేలే 14 రోజుల ముందు సందర్శించిన  ప్రదేశాలను గుర్తించడానికి ఒక ప్రత్యేక పరికరం ఏర్పాటు చేశారు అది మాత్రమే కాకుండా కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్ల ని తీసేసి కోవిడ్ 19 పరీక్షలకోసం ప్రత్యేక బస్సులు గా మార్చారు. ఇప్పటికే కొన్ని బస్సులు ఏర్పాటు అయ్యాయి. ముందు ముందు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి బస్సుల్ని ప్రవేశపెడతామని చెప్పారు.

90 రోజుల్లో ప్రతి ఇంటికి కరోనా పరీక్ష

జగన్ ప్రభుత్వం కరోనా నిర్మూలనకు ఏమేం చర్యలు తీసుకోవాలో ఆలోచించి ఎన్నో రకాలుగా ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా తమ ముందు జాగ్రత్త ఆలోచనలతో ఎత్తులు వేస్తూ వీరితో పోటీపడే అవకాశం వేరే రాష్ట్రాలకు వెళ్లే ముందే మళ్లీ కొత్త కరోనా నిర్మూలన పథకం ప్రవేశపెట్టి పై ఎత్తు కూడా వీళ్లే వేస్తున్నారు. 90 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్ళలోనూ కరోనా పరీక్ష జరగాలి అని జగన్ ఆదేశించారు.

ప్రతి చోట ఆసుపత్రుల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. ఆవే కాకుండా ప్రతి గ్రామంలో లో కోవిడ్ 19 ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. అవి కాకుండా కోవిడ్ కేసుల కోసం ప్రభుత్వం ఇంకా ప్రైవేట్ ఆస్పత్రిల తో కలిపి అదనంగా వైద్య సేవలు అందించేందుకు 5 మెడికల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్ 19

ఆర్థిక స్తోమత అనారోగ్యానికి కారణం కాకూడదు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో కోవిడ్ 19 ని కూడా చేర్చింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా పరీక్షలు చేయించుకుంటే, పరీక్షించినందుకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.అందుకు అదనంగా పేషంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.

ఆన్లైన్ ద్వారా మందుల డెలివరీ

ఇదే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో మందులు కావాలంటే బయటికి వెళ్ళటం కూడా కష్టం అవ్వడం వల్ల ఆన్లైన్ లోనే కావాల్సిన మందులు తెప్పించుకునే సదుపాయం కల్పించారు. వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ ద్వారా ఈ సేవలను అందిస్తున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వారికి కాల్ చేస్తే ఏ సమస్యకు ఏ మందు వాడాలో చెప్పడంతో పాటు వాటిని ఇంటికి కూడా డెలివరీ చేస్తున్నారు.

ఇలా ఇన్ని సదుపాయాలతో ఆంధ్ర ప్రదేశ్ అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రం గా నిలిచింది.
ఎంతో శ్రద్ధగా ప్రణాళిక వేసి అంతే శ్రద్ధగా ఆ ప్రణాళికను అమలు చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. అలాగే వేరే రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోంది. ఇలాగే కొనసాగితే బహుశా ఆంధ్రప్రదేశ్ కరోనా రహిత రాష్ట్రంగా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


End of Article

You may also like