కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా బస్సులు ,రైళ్లు ,విమానాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.దీనితో అంతా  ఇళ్లకే పరిమితమయ్యారు ..కాగా ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు.ఇలాంటి పరిస్థితులలో చాలామంది వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు .

Video Advertisement

ఇలాంటి పరిస్థితులలో ముంబై నుండి అలహాబాద్ ప్రయాణించడం ఎలా ?..ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ లో పనిచేస్తున్న ప్రేమ్ మూర్తి పాండే కు ఒక క్రియేటివ్ ఆలోచన వచ్చింది ..ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉపయోగించుకొని 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకున్నాడు ..

representative image

ముంబైలోని ధారావి మురికివాడలో చిక్కుకున్న ప్రేమ్ మూర్తి పాండే తన ఇంటికి ఉల్లిపాయ ట్రక్ ద్వారా చేరుకున్నాడు .ఉల్లిపాయ ముఖ్యమైన నిత్యావసర కూరగాయ కాబట్టి దాని రవాణా నిషేదించలేదు కాబట్టి అతను ప్రయాణించడానికి చాలా సులభంగా అనుమతి పొందాడు ..ధారవిలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నేను అక్కడ ఉండడం ప్రమాదం అని తెలిసి ప్రయాగరాజ్ లోని నా సొంత ఉరికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను అని పాండే తెలిపారు ..

representative image

లాక్ డౌన్ కారణంగా నేను నా ఇంటికి చేరలేను .అయినప్పటికీ నేను కూరగాయల లేదా పండ్ల వ్యాపారి అయితే నన్ను నగరంలోకి అనుమతిస్తారని తెలుసుకున్నాను అని పాండే వెల్లడించారు .కూరగాయలు మరియు పండ్ల రవాణాకు కేంద్ర ప్రభుత్త్వం ఎటువంటి పరిమితులు విధించలేదు ,ఎందుకంటే అవి అవసరమైన వస్తువుల పరిధిలోకి వస్తాయి ..నాసిక్ నుండి 2 .3 లక్ష రూపాయలతో 25 .2 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసాడు ..తరవాత 77 ,500 రూపాయలకు ఒక ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు .పాండే అదే రోజు ఉల్లిపాయల ట్రక్కుతో ప్రయాగరాజ్ బయలుదేరాడు ..ఉల్లిపాయలను ప్రయాగరాజ్ లో అమ్మి నేను పెట్టుబడి పెట్టిన 3 లక్షలు నేను తిరిగి పొందుతానని తెలుసు

representative image

పాండే గురువారం రాత్రి ప్రయాగరాజ్ చేరుకొని ఉల్లిపాయలను విక్రయించేందుకు నేరుగా ముండేరా ముండి కి వెళ్లగా అక్కడ ఉల్లిపాయలు అమ్మడంలో విఫలం అయ్యాడు ..తర్వాత నగరంలోని కొట్వా ముబార్కపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకున్నాడు .ఈ ఉల్లిపాయలను చిన్న వ్యాపారులకు అమ్ముదామనే ఆలోచనలో ఉన్నట్లు  పండేయ్ తెలిపారు ..

representative image

ఈ నేపథ్యంలో ముంబై నుండి ఒక వ్యక్తి వచ్చాడని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ,ఆరోగ్య శాఖ బృందం అతని ఇంటికి చేరి థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అనంతరం అతని దగ్గర నుండి శ్వాబ్ శాంపిల్ తీసుకున్నారు ..పాండే ను నిర్బంధంలో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలిసిందిగా చెప్పారు ..ఆ తర్వాత కరేలీ లోని క్వారంటైన్ సెంటర్ కి తరలించారు ..

representative image

నేను ఏ తప్పు చెయ్యలేదు .. నేను ముంబైలో పనిచేస్తున్నాను కాగా నా వృద్ధ తలితండ్రులతో సహా నా కుటుంబం మొత్తం ఇక్కడ ఉంది .నా కుటుంబం పట్ల నాకు బాధ్యతలు ఉన్నాయి.నేను ఇంటికి చేరడానికి పూర్తిగా చట్టబద్దమైన మార్గాన్ని ఎంచుకున్నాను అని పాండే తెలిపారు ..