Ads
అసలే బయట పరిస్థితులు అస్సలు బాలేదు. రోడ్డుమీద అవతల వ్యక్తి తుమ్మినా దగ్గినా కూడా భయపడుతున్నారు. మాస్కులు కూడా కరోనాను ఆపలేకపోతున్నాయి. సామాజిక దూరం కూడా పనిచేయట్లేదు.
Video Advertisement
ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సిటీలు ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు అందరూ తమకు తోచినంత వరకు నియమ నిబంధనలు పెట్టి ప్రజలను రక్షించాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాళ్లే కాకుండా వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్లను కూడా రిస్క్ లో పెడుతున్నారు.
వివరాల్లోకెళ్తే సహబ్ సింగ్ అనే వ్యక్తి జూన్ 29న ముంబై నుండి ఉడిపి కి వచ్చాడు. కర్ణాటక ప్రభుత్వం వాళ్లు అతనిని జూలై 3 వరకూ హోమ్ క్వారంటైన్ లో ఉండాలి అని సూచించారు. సహబ్ సింగ్ ఆ నిబంధనలు ఏమీ లెక్కచేయకుండా బయటికి వెళ్లాడు.
ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి జీపీఎస్ ట్రాకర్ ద్వారా సహబ్ సింగ్ ఏయే ప్రదేశాలకు వెళ్ళాడో కనుక్కున్నారు. 14 రోజుల హోమ్ క్వారంటైన్ పీరియడ్ లో దాదాపు 163 సార్లు అతను బయటికి వెళ్లాడట. ఉడిపి, కుందపూర్ లో పలు హోటళ్ల కి వెళ్ళాడట సహబ్ సింగ్. నిబంధనలు ఉల్లంఘించినందుకు సహబ్ సింగ్ మీద కుందపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
End of Article