Ads
కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.అమెరికా ,బ్రిటన్ లాంటి అగ్ర దేశాలు కూడా కరోనా దాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి.చేసేది ఏమి లేక సామజిక దూరం పాటిస్తూ కరోనా ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి.ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ,పాజిటివ్ కేసులో కూడా నమోదు అవుతున్నాయి.ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుండి సెలబ్రెటీల దాక అందరూ ఇళ్లకే పరిమితం అయినా విషయం తెలిసిందే.సెలబ్రెటీలు అందరూ కూడా భౌతిక దూరం పాటించాలి అని సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ నటుడు మరియు గాయకుడూ అయిన పుష్పవనం కుప్పుస్వామి కుమార్తె పల్లవి సోషల్ మీడియా లో కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.ఆ వివరాలేంటో చూద్దాం …తమిళనాడులోని ఓ ప్రముఖ ఆసుపత్రి పల్లవి డాక్టర్ గా పనిచేస్తున్నారు.తాజాగా కరోనా నేపథ్యంలో పేస్ బుక్ లో స్పందిస్తూ …స్టే హోమ్ ,స్టే సేఫ్ ,ప్రేమని పొందండి …పిల్లలని కాదు …
Video Advertisement
ఈ మధ్యకాలంలో ఆసుపత్రికి వచ్చే గర్భవతులు సంఖ్య గణనీయంగా పెరిగింది అని తెలిపారు.కరోనా సమయంలో డాక్టర్ లు కరోనా పేషెంట్స్ కి చికిత్స అందిస్తూ బిజీగా ఉన్నారు కావున ఇప్పుడు డాక్టర్లకు మాములు పేషెంట్స్ ను చూసేంత తీరిక లేదు కాబట్టి శృంగార జీవితానికి కొంచెం దూరంగా ఉండాలని వ్యంగ్యంగా పల్లవి ఇలా పోస్ట్ చేసారు.కాగా ఇప్పుడు పల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అంతటా చర్చనీయాంశం అయింది .
End of Article