గత 75 రోజులుగా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నా…అయినా నాకు కరోనా సోకింది!

గత 75 రోజులుగా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నా…అయినా నాకు కరోనా సోకింది!

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా తీవ్ర విపత్తును ఎదురుకుంటున్న విషయం తెలిసిందే.అయితే బంగ్లాదేశీ అమెరికన్ బ్యూటీ బ్లాగర్ నాబెలా నూర్ కరోనా బారిన పడ్డారు.ఎంతో జాగ్రత్తగా 75 రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాని కానీ ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు నాబెలా నూర్.పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

యూట్యూబ్ ద్వారా బ్యూటీ చిట్కాలు చెప్తూ ప్రజలకు ఎంతో చేరువయ్యారు నాబెలా నూర్.తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తుంటారు నాబెలా నూర్.ఎంతో లావుగా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ పెట్టినాసరే… నేను అవేమి పట్టించుకోను మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలి అని చెప్తూ ఉంటారు నాబెలా నూర్.అయితే కరోనా కారణంగా గత 75 రోజుల నుండి ఇంటికే పరిమితమయ్యారు నాబెలా నూర్.ఈ 75 రోజులలో ఐదుసార్లు మాత్రమే బయటకు వెళ్లాలని, వెళ్లిన ప్రతిసారి మాస్క్ ,శానిటైజర్ ఉపయోగించానని సామాజిక దూరం కూడా పాటించానని, అయినాగానీ ఎందుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందో తెలియలేదు అన్నారు నాబెలా నూర్.

అయితే ఈ సమయంలో నా భర్త సేత్ మార్టిన్ నాకు అండగా నిలబడ్డారని ఆనందం వ్యక్తం చేసారు నాబెలా నూర్.ఈ నేపథ్యంలో చికిత్స చేయించుకుంటున్న నాబెలా నూర్ ప్రతిరోజు తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది  అనే విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు నాబెలా నూర్.అయితే సానుకూల దృక్పధంతో ఉంటే ఎటువంటి ఆరోగ్య సమస్యను అయినా తరిమి కొట్టచ్చు అని,  త్వరలోనే నేను కరోనా బారినుండి బయటపడతానని నాబెలా నూర్ అన్నారు.


End of Article

You may also like