Ads
ఇది స్మార్ట్ యుగం. స్మార్ట్ ఫోన్లు, గడ్జెట్స్ వాడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్ధులు తమ మిత్రులతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడే విధంగా ఫేస్బుక్ సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా, పిల్లల్లో స్టడీ స్కిల్స్ పెంపొందించేందుకుగానూ ఫేస్బుక్ సరికొత్త యాప్ ను రూపొందించింది పిల్లల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ మెసెంజర్ కిడ్స్ యాప్ ను ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
Video Advertisement
కొన్ని రోజుల తరువాత దాన్ని గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్నితీసుకువస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది. తన మెసెంజర్ కిడ్స్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. .ఈ యాప్ పూర్తిగా తల్లిదండ్రుల పర్యవేక్షణలో పనిచేసే యాప్ , ఈ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో ఎడ్యుకేషన్ కు సంబంధించిన సందేహాలు తీర్చుకోవచ్చు.ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ సంబంధించి పూర్తి సమాచారం ఫేస్బుక్ ఇంకా ప్రకటించలేదు .
End of Article