Ads
ఐపీఎల్ 2020 లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 13 పరుగుల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నారు. యువ ఓపెనర్ పృథ్వీ షా (0) మొదటి బాల్ కి బౌల్డ్ అయ్యారు. తర్వాత అజింక్య రహానె (2: 9 బంతుల్లో) స్కోర్ చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (57: 33 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (53: 43 బంతుల్లో 3×4, 2×6) చేశారు.
Video Advertisement
తర్వాత స్లాగ్ ఓవర్లలో మార్కస్ స్టాయినిస్ (18: 19 బంతుల్లో 1×4), అలెక్స్ క్యారీ (14: 13 బంతుల్లో 1×6) చేయగా, చివరి ఓవర్ లో అక్షర్ పటేల్ (7: 4 బంతుల్లో 1×4) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో జోప్రా ఆర్చర్ మూడు వికెట్లు, జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు, కార్తీక్ త్యాగి ఒక వికెట్, శ్రేయాస్ గోపాల్ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 161 పరుగుల స్కోర్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ (22: 9 బంతుల్లో 3×4, 1×6), బెన్‌స్టోక్స్ (41: 35 బంతుల్లో 6×4) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (1) చేయగా, సంజు శాంసన్ (25: 18 బంతుల్లో 2×6), రాబిన్ ఉతప్ప (32: 27 బంతుల్లో 3×4, 1×6) చేశారు. రియాన్ పరాగ్ (1), జోప్రా ఆర్చర్ (1), శ్రేయాస్ గోపాల్ (6), చివరి వరకు క్రీజ్ లో ఉన్న రాహుల్ తెవాటియా (14 నాటౌట్: 18 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ చెట్టు బౌలర్లలో తుషార్ రెండు వికెట్లు, అన్రిచ్ నోర్తేజ్ రెండు వికెట్లు,కగిసో రబాడ ఒక వికెట్, అశ్విన్ ఒక వికెట్, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 148/8 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article