ఎవరు ఈ SRH బౌలర్ నటరాజన్.? అతని వెనకున్న ఈ కన్నీటి కథ తెలుసా?

ఎవరు ఈ SRH బౌలర్ నటరాజన్.? అతని వెనకున్న ఈ కన్నీటి కథ తెలుసా?

by Sainath Gopi

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 162 పరుగులు చేసింది.  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 147/7 స్కోర్ చేసింది. దాంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Video Advertisement

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్ తంగరసు నటరాజన్. నటరాజన్ 5 జనవరి 2015 లో 2014–15 రంజీ ట్రోఫీ తో ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశారు. తర్వాత 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్ తో ట్వంటీ-20 లో అడుగు పెట్టారు. తర్వాత 2018 లో జరిగిన 2018–19 విజయ్ హజారే ట్రోఫీ తో లిస్ట్ ఏ డెబ్యూట్ చేశారు. నటరాజన్ తమిళనాడుని రిప్రజెంట్ చేస్తూ ఆడేవారు.

ఫిబ్రవరి 2017 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఐపీఎల్ 2017 ఆక్షన్ లో నటరాజన్ తో 3 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత 2018 ఐపీఎల్ ఆక్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జుట్టు తరపున ఆడటం మొదలుపెట్టారు నటరాజన్.  సేలం జిల్లా లోని చిన్నప్పంపట్టి అనే గ్రామంలో పెరిగారు నటరాజన్. నటరాజన్ కి సౌకర్యాలు ఉండేవి కావట. నటరాజన్ తల్లి ఒక రోజు వారి ఉద్యోగి. తండ్రి చీరలు మాన్యుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో పని చేసే వారట.

నటరాజన్ టి ఎన్ పి ఎల్ (తమిళ్ నాడు ప్రీమియర్ లీగ్) ఆడుతున్న సమయంలో అందరి దృష్టిలో పడ్డారట. తనతో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడే చాలా మందికి సహాయం చేస్తున్నారట నటరాజన్. తన ముగ్గురు తోబుట్టువులకు కూడా చదువు అందిస్తున్నారు నటరాజన్. అలాగే తల్లిదండ్రులకి ఇల్లు కూడా కట్టారట. ముందు కనీస అవసరాలపై శ్రద్ధ పెట్టాలి. లగ్జరీస్ గురించి తర్వాత అయినా ఆలోచించవచ్చు అని అంటారట నటరాజన్.

 

అంతేకాకుండా తను ఉండే చోటు నుండి వచ్చిన పెరియస్వామి అనే బౌలర్ ఒక సమయంలో క్రికెట్ మీద ఆశలు వదిలేస్తే, అతని ఇంటికి వెళ్లి పెరియస్వామి కి మంచి భవిష్యత్తు ఉంది అని అతని తల్లిదండ్రులను ఒప్పించారట నటరాజన్. నటరాజన్ ఒక సందర్భంలో “ముందు నా సోదరిలని చదివించాలి. వాళ్లకు చదువు అందితే వారి జీవితాలు వారే మెరుగుపరుచుకోగల సామర్థ్యం వస్తుంది. అది వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఇస్తుంది. నేను ఫ్యాన్సీ కారులో డ్రైవ్ చేయడం కంటే వీళ్ళ చదువులో ఇన్వెస్ట్ చేయడమే ముఖ్యం” అని అన్నారట.


End of Article

You may also like