ఆడియన్స్ కి అనుమతి లేదు…మరి ఈ సారి ఐపీఎల్ కి క్రికెటర్ల భార్య పిల్లలకి అనుమతి ఉంటుందా.?

ఆడియన్స్ కి అనుమతి లేదు…మరి ఈ సారి ఐపీఎల్ కి క్రికెటర్ల భార్య పిల్లలకి అనుమతి ఉంటుందా.?

by Megha Varna

Ads

కరోనా దెబ్బ ఈ సంవత్సరం జరగాల్సిన వాణిజ్య కార్యక్రమాలన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి.అందులో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఆదరించే ఐపీఎల్ కూడా ఉంది.ఇక ఐపీఎల్ ఈసారి యూఏఈలో జరగబోతుంది.కరోనాను దృష్టిలో ఉంచుకొని ఈసారి బీసీసీఐ ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఖాళీ స్టేడియంలలో ఐపీఎల్ ను నిర్వహించడానికి సిద్ధమైంది.అలాగే ప్లేయర్స్ సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది.

Video Advertisement

 

అలాగే ఈసారి ఐపీఎల్ ను నిర్వహించే సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు బోర్డ్ తర్జన భర్జన పడుతుంది.ఇక ప్లేయర్స్ కుటుంబాలను ఈసారి అనుమతించాలా?ఒకవేళ అనుమతిస్తే వారిని హోటల్స్ కి పరిమితం చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై పరిశీలిస్తున్నారు.

ఇక ప్లేయర్స్ ను ప్లేయర్స్ రక్షణగా వ్యవహరించే సెక్యూరిటీని, గ్రౌండ్ స్టాఫ్ ను,ప్లేయర్స్ కు ఆహారాన్ని అందించే క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ ను ఫ్రీగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు నిర్వాహకులు వాళ్ళ పై సర్వేలైన్స్ ఉంచాలి. అలాగే ఎప్పుడు ఒక ఫ్లోర్ లేదా రెండు ఫ్లోర్స్ ను అద్దెకు తీసుకునే ఫ్రాంచైజీలు ఈసారి కరోనా ను దృష్టిలో ఉంచుకొని భద్రత రీత్యా హోటల్ మొత్తాన్ని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది.ఇది ఫ్రాంచైజీల పై ఆర్థిక భారాన్ని పెంచుతుంది.

వీటన్నిటినీ ప్రస్తుతం బీసీసీఐ ఎలా అధిగమించాలి అనే విషయంపై నిపుణులతో చర్చిస్తుంది.క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ స్టార్ట్ అవుతుండడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాని టీం మేనేజ్ మెంట్స్ మరియు బీసీసీఐ అవాంతరాలు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం పై తలలు పట్టుకుంటున్నారు.


End of Article

You may also like