DC vs KKR మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్.!

DC vs KKR మ్యాచ్ ఎఫెక్ట్…ట్రెండ్ అవుతున్న టాప్ 10 మీమ్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 20 20 లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్కత్తా నైట్ రైడర్స్ జుట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడా తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్ (26: 16 బంతుల్లో 2×4, 2×6), పృథ్వీ షా (66: 41 బంతుల్లో 4×4, 4×6) జోడీ తొలి వికెట్ ‌కి 5.5 ఓవర్లలో 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. చక్రవర్తి బౌలింగ్ లో సిక్స్ కొట్టబోయి శిఖర్ ధావన్ అవుట్ అయ్యారు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ (88 నాటౌట్: 38 బంతుల్లో 7×4, 6×6), పృథ్వీ షా భాగస్వామ్యం లో ఓవర్‌కి ఒక ఫోర్ లేదా సిక్స్ కొడుతూ వచ్చారు. జట్టు స్కోరు 129 దగ్గర ఉన్నప్పుడు పృథ్వీ షా అవుటయ్యారు. తర్వాత రిషబ్ పంత్ (38: 17 బంతుల్లో 5×4, 1×6), స్టాయినిస్ (1), షిమ్రోన్ హెట్మెయర్ (7 నాటౌట్) స్కోర్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 228/4 స్కోర్ చేసింది.

Video Advertisement

కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు లో ఇయాన్ మోర్గాన్ (44: 18 బంతుల్లో 1×4, 5×6), రాహుల్ త్రిపాఠి (36: 16 బంతుల్లో 3×3, 3×6) స్కోర్ చేశారు. ఓపెనర్ సునీల్ నరైన్ (3), ఓపెనర్ శుభమన్ గిల్ (28: 22 బంతుల్లో 2×4, 2×6) చేయగా నితీశ్ రాణా (58: 35 బంతుల్లో 4×4, 4×6), ఆండ్రీ రసెల్ (13: 8 బంతుల్లో 1×4, 1×6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6: 8 బంతుల్లో) స్కోర్ చేశారు. దాంతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 210/8 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1 #2 #4 #5 #6 #7 #8 #9 #10

#11 #12 #13


End of Article

You may also like